Kichcha Sudeep: టాలీవుడ్‌లోకి కిచ్చా సుదీప్ కూతురు.. ఏకంగా నాని సినిమాలో ఛాన్స్.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

కిచ్చా సుదీప్ కూతురు సాన్వి సుదీప ఇప్పటికే స్టార్ కిడ్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సినిమాల్లో తన అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఆమె ఓ తెలుగు సినిమాకు వర్క్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న సుదీప్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

Kichcha Sudeep: టాలీవుడ్‌లోకి కిచ్చా సుదీప్ కూతురు.. ఏకంగా నాని సినిమాలో ఛాన్స్.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
Kichcha Sudeep Daughter

Updated on: Apr 26, 2025 | 3:47 PM

కిచ్చా సుదీప్ కూతురు శాన్వి సుదీప్ ఇంకా చదువుకుంటోంది. అయినప్పటికీ ఎక్స్ ట్రా కరిక్యూలర్ యాక్టివిటీస్ లో చురుగ్గా ఉంటుంది. ఆమెకు సింగింగ్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే పాప్ సాంగ్స్ తో కన్నాట నాట క్రేజ్ తెచ్చుకున్న సుదీప భవిష్యత్తులో మంచి సింగర్ అవ్వానుకుంటోంది. ఇప్పుడు ఆమె ఓ తెలుగు సినిమాకు తన గొంతును అరువుగా ఇచ్చింది. అది కూడా న్యాచురల్ స్టార్ నాని సినిమాకు. అవును అతని లేటెస్ట్ మూవీ హిట్ 3 సినిమాకు శాన్వి వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఈ విషయాన్ని నానినే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. దీంతో ఈ వార్త విన్న కిచ్చా సుదీప్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ‘సాన్వి గొంతు బాగుంటుంది. ఆమె పాప్ సాంగ్స్ అద్భుతంగా పాడుతుంది. జీ కన్నడలో ‘సరిగమప’ వేదికపై ‘అప్పా ఐ లవ్ యు పా..’ పాటను అద్భుతంగా ఆలపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏకంగా తెలుగు సినిమాకు తన గొంతును అరువుగా ఇచ్చింది శాన్వి. నాని నటించిన హిట్ 3 సినిమా ట్రైలర్ లో శాన్వి గొంతు వినిపిస్తుంది. కాగా ‘హిట్ 3’ సినిమా ట్రైలర్ కొన్ని రోజుల క్రితం విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందులో వినిపించిన బీజీఎమ్, వాయిస్ ఓవర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇప్పుడు ఆ వాయిస్ ఓవర్ శాన్విదేనని రివీల్ చేశాడు నాని.

నాని, సాన్విల మధ్య పరిచయం ఏర్పడటానికి కారణం ‘ఈగ’ సినిమా. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని హీరోగా కనిపించగా, సుదీప్ విలన్‌గా నటించాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో నానికి పరిచయమైంది శాన్వి. ఆ అనుబంధం ఇప్పటికీ కొనసాగుతోంది. అలా ఇప్పుడు హిట్-3 సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది సుదీప్ కూతురు. మరి భవిష్యత్తులో శాన్వి సింగర్ గా కెరీర్ కొనసాగిస్తుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

హిట్ 3 సినిమాలో శాన్వి ..

‘హిట్ 3’ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాలో నాని, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 1న విడుదల కానుంది.

ట్రెడిషినల్ లుక్ లో సుదీప్ కూతురు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి