బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు(Rakshasudu ) సినిమా మంచి విజయాన్ని సంధించిన విషయం తెలిసిందే. తమిళ్ సినిమా రీమేక్ గా వచ్చిన ఈ సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. అల్లుడు శ్రీను సినిమా తరవాత బెల్లంకొండకు హిట్ అందించిన సినిమా ఇది. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ అని ప్రకటించిన దగ్గర నుంచి ప్రేక్షకులలో ఆసక్తి మొదలైంది. ఇక ఇప్పుడు ఈ సీక్వెల్ లో హీరోగా ఎవరు నటిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
అయితే మొదటి పార్ట్ లో నటించిన బెల్లంకొండనే ఈ సినిమాలోనూ హీరోగా చేస్తారని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు మరో హీరో పేరు కూడా వినిపిస్తోంది. రాక్షసుడు సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడు దర్శకుడు రమేష్ వర్మ కూడా లీడ్ రోల్ లో మరో హీరోని తీసుకోవాలనుకున్నారు.ఈ మేరకు చాలా మంది హీరోల పేర్లను సంప్రదించారట.చివరిగా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే ఆయన నటించిన విక్రాంత్ రొణ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు సుదీప్ రాక్షసుడు 2లో నటిస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈ మూవీని భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. హారర్ థ్రిల్లర్ గా సినిమా రూపొందుతున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ ను హీరోయిన్ గా నటించనుందని టాక్. అలాగే విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నారని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.