Kiara Advani : మరోసారి ఆ హీరోతో సినిమా చేయాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన బ్యూటీ..

బాలీవుడ్ బ్యూటీ కియార్ అద్వానీ ఇప్పుడు యమా స్పీడ్ తో దూసుకుపోతుంది. ఈ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది.

Kiara Advani : మరోసారి ఆ హీరోతో సినిమా చేయాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన బ్యూటీ..
Kiara Advani

Edited By: Phani CH

Updated on: Oct 15, 2021 | 8:50 AM

Kiara Advani : బాలీవుడ్ బ్యూటీ కియార్ అద్వానీ ఇప్పుడు యమా స్పీడ్ తో దూసుకుపోతుంది. ఈ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. అటు బాలీవుడ్ సినిమాలతోపాటు ఇటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ అలరిస్తుంది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో పరిచయం అయ్యింది కియారా. ఈసినిమా మంచి విజయం సాధించడంతో వెంటనే బోయపాటి పిలిచి ఛాన్స్ ఇచ్చారు. బోయపాటి-రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో నటించింది కియారా. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. దాంతో ఈ అమ్మడు బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కబీర్ సింగ్ సినిమాలో నటించింది ఈ బ్యూటీ. తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో రీమేక్ చేశారు. ఇక ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్  బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా కియారా- షాహిద్ కెమిస్ట్రీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఇటీవల కియారా అద్వానీ మాట్లాడుతూ మరోసారి షాహిద్ లో కలిసి నటించాలని ఉంది అని మనసులో మాట చెప్పుకొచ్చింది. కబీర్ సింగ్ సినిమా నా కెరీర్ లో బెస్ట్ మూవీ అని చెప్తాను. అలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. షాహిద్ లాంటి నటుడిగాతో నటించడం వండర్ఎ ఫుల్ ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చింది అని అంది కియార. అలాగే మళ్లీ షాహిద్ తో కలిసి నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోను. అలా జరగాలని ఆ దేవుణ్ని నేను కూడా కోరుకుంటాను అని కియారా చెప్పుకొచ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jabardasth Sai Teja: సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్‌గా మారడానికి పెద్ద యుద్ధమే చేశా.. తండ్రి అంధుడు.. చూసేవారు లేరంటూ..

Manchu Manoj-Pawan Kalyan: పవన్ కల్యాణ్‌తో మంచు మనోజ్ కీలక భేటీ.. గంటకు పైగా చర్చ

Mahesh Babu: రాజమౌళితో సినిమాపై మహేశ్ ఫుల్ క్లారిటీ.. ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్