K.G.F: Chapter 2 : దక్షిణాదితో పాటు ఉత్తరాది సినీప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఒకటి. కన్నడ రాక్ స్టార్ యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఇది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని జులై 16న వరల్డ్ వైడ్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ సినిమాలో విలన్ అధీరాగా బాలీవుడ్ కండల వీరుడు సంజయ్ దత్ నటించడం కూడా ఈ సినిమాకు ప్లస్‌గా మారనుంది. ఇప్పటి వరకు సంజయ్ దత్ సౌత్ ఇండియా సినిమాలో చిన్న చిన్న గెస్ట్ రోల్స్ మాత్రమే చేశాడు తప్ప.. ఫుల్ల ఎంత్ విలన్‌గా నటించలేదు.. ఇక ఈ సినిమాతో ఆ పని చేయనున్నాడు సంజయ్ దత్ .అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో రూమర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. కేజీఎఫ్ చాప్టర్ 1 కి కొనసాగింపుగా వస్తున్న కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాతో ఈ సిరీస్ కంచికి చేరనుందట. అవును కేజీఎఫ్ సిరీస్ లో కేజీఎఫ్ 2 నే అఖరు సినిమా అని ఇటు ఇండస్ట్రీలోనూ.. అటు సోషల్ మీడియాలోనూ.. చర్చ జరుగుతుంది. దీనికి కారణంకూడా లేకపోలేదు.. కేజీఎఫ్2 లో హీరో చనిపోతాడని అందువల్ల ఈ సిరీస్ కు శుభం కార్డు పడుతుందని గతంలో వార్తలు వచ్చాయి. దాంతో ఇప్పడు ఈ సిరీస్ తో కేజీఎఫ్ ముగుస్తుందని అన్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఈ విషయం తెలిసిన కేజీఎఫ్ అభిమానులు అలా జరగకూడదంటూ.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రెక్వెస్ట్ పెడుతూ.. వేడుకుంటున్నారు. రిక్వెస్ట్ లను పట్టించుకుని.. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 3 అంటాడో.. లేక లైట్ తీసుకుంటాడో చూడాలి మరి.
మరిన్ని ఇక్కడ చదవండి :
శృతి హాసన్ అనుకోని బెంగ పట్టుకుంది.. ముద్దుగుమ్మను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు .. కారణం ఇదే..