Ketika Sharma: పవన్ కళ్యాణ్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న బబ్లీ బ్యూటీ..

|

Mar 04, 2023 | 11:57 AM

తొలి సినిమాతోనే అందంతో ఆకట్టుకుంది. ఈ అమ్మడి గ్లామర్ కు కుర్రకారంతా ఫిదా అయ్యారు. చెక్కిన శిల్పం లాంటి ఈ చిన్నది చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

Ketika Sharma: పవన్ కళ్యాణ్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న బబ్లీ బ్యూటీ..
Ketika Sharma
Follow us on

టాలీవుడ్ లో పరిచయమైన అందాల భామల్లో కేతిక శర్మ ఒకరు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తనయుడి ఆకాష్ పూరి హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ చిన్నది. తొలి సినిమాతోనే అందంతో ఆకట్టుకుంది. ఈ అమ్మడి గ్లామర్ కు కుర్రకారంతా ఫిదా అయ్యారు. చెక్కిన శిల్పం లాంటి ఈ చిన్నది చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోతోంది కేతిక శర్మ. ఈ సినిమా తర్వాత యంగ్ హీరో నాగ శౌర్య సరసన లక్ష్య అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఆ తర్వాత మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ రంగరంగ వైభవంగా సినిమాలో చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది మరో బంపర్ ఆఫర్ అందుకుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,  మెగా మేనల్లు సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న సినిమాలో కేతిక ఛాన్స్ దక్కించుకుంది. పవన్ , తేజ్ కలిసి తమిళ్ మూవీ అయిన వినోదయ సిత్తం సినిమాను రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కేతికతో పాటు మరో బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ కూడా నటిస్తోంది. ఈ సినిమాతో కేతిక దశతిరుగుతుందని బోలెడన్ని ఆశలతో ఉంది. ఈ సినిమాలో తేజ్ కు జోడీగా కనిపించనుందట కేతిక. చూడాలి మరి ఈ సినిమా అమ్మడి కెరీర్ కు ఎంతవరకు కలిసొస్తుందో.