
పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒక టాలీవుడ్ హీరోయిన్. ఇప్పుడు సినిమాలు చేయట్లేదు కానీ ఇంతకు ముందు చేసింది. అది కూడా వన్ ఫిల్మ్ వండర్ లా కేవలం ఒకే ఒక్క తెలుగు సినిమానే చేసింది. కానీ తన క్యూట్ యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ ముద్దుగుమ్మ మరిన్ని సినిమాలు చేస్తుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. 2022లో పెళ్లి చేసుకుంది. ఆపై సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తోంది. ఈ విషయాలు పక్కన పెడితే.. త్వరలోనే ఈ అందాల తార తల్లిగా ప్రమోషన్ పొందనుంది. ప్రస్తుతం నిండు గర్భంతో ఉన్న ఈ హీరోయిన్ త్వరలోనే ఒక పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోన్న ఆమె తన ప్రెగ్నెన్సీ విషయాలు, ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. అలా తాజాగా బేబీ బంప్ తో ఉన్న కొన్ని ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా క్షణాల్లోనే వైరల్ గా మారింది. మరి ఇంతకీ ఆమె ఎవరో గుర్తు పట్టారా?
పై ఫొటోలో ఉన్నది సుకృతి అంబటి. ఇలా పేరు చెబితే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు కానీ ‘కేరింత’ సినిమా హీరోయిన్ భావన అంటే ఓ క్యూట్ అమ్మాయి మన కళ్ల ముందు మెదులుతుంది. 2015లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే దీని తర్వాత మరో సినిమా చేయలేదు సుకృతి. 2022 డిసెంబరులో అక్షయ్ సింగ్‌ని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. కొన్ని నెలల క్రితమే తాను గర్భంతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా శుభవార్త చెప్పింది.
తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది సుకృతి. అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో బేబీ బంప్ తో కనిపించింది సుకృతి. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ అమ్మడికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి