అందాల భామ కీర్తిసురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ భామ. కీర్తిసురేష్ తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది. నేను శైలజ సినిమా హిట్ అవ్వడంతో ఈ చిన్నదానికి వరస అవకాశాలు క్యూ కట్టాయి. తక్కువ సమయంలోనే కీర్తికి ఫాలోయిన్ పెరిగిపోయింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో మరో హిట్ అందుకుంది ఈ చిన్నది. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యింది ఈ చిన్నది. ఆ తర్వాత వరుస స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తోంది. ఈ బ్యూటీ. అటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
కెరీర్ లో గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉన్న కీర్తి. రీసెంట్ గా వచ్చిన మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో రెచ్చిపోయింది. అందాలతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇదిలా ఉంటే ఇప్పుడు దసరా సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. నాని హీరోగా నటించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో కీర్తి డీ గ్లామర్ పాత్రలో కనిపించనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తిసురేష్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో కీర్తిసురేష్ బాలీవుడ్ సినిమాల పై క్రేజీ కామెట్స్ చేసింది. తనకు షారుఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టమని.. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే ఏ మాత్రం వదులుకోనని తెలిపింది. మరి ఈ చిన్నదాని కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.