Keerthy Suresh: బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో ఫుల్ బిజీ అయిన బ్యూటీ.. హోమ్ బ్యానర్‌లో సినిమా మొదలుపెట్టిన కీర్తి సురేష్..

|

Nov 20, 2021 | 8:28 AM

చూడటానికి అచ్చం తెలుగమ్మాయిలానే కనిపిస్తుంది అందాల భామ కీర్తిసురేష్. ఎనర్టిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ.

Keerthy Suresh: బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో ఫుల్ బిజీ అయిన బ్యూటీ.. హోమ్ బ్యానర్‌లో సినిమా మొదలుపెట్టిన కీర్తి సురేష్..
Follow us on

Keerthy Suresh: చూడటానికి అచ్చం తెలుగమ్మాయిలానే కనిపిస్తుంది అందాల భామ కీర్తిసురేష్. ఎనర్టిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఆతర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది ఈ చిన్నది. కీర్తి సురేష్ ప్రస్తుతం ఉన్న బిజీ హీరోయిన్స్‌లో ఒకరు. ఆమె తెలుగు తోపాటు తమిళ్‌లోనూ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుంది ఈ అందాల భామ. ఈ సినిమాతో మొదటి సారి మహేష్ తో జతకడుతుంది కీర్తి. అలాగే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో గుడ్ లక్ సఖి అనే సినిమా కూడా చేస్తుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇదిలా ఉంటే హీరోయిన్ గానే కాదు హీరోల చెల్లెలి క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు కీర్తి సురేష్. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్దన్న సినిమాలో రజినీ చెల్లెలుగా నటించింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్ లో రాబోతున్న భోళాశంకర్ సినిమాలో చిరు సిస్టర్ గా నటిస్తుంది కీర్తిసురేష్. ఇప్పటికే అర డజను చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ.. లేటెస్టుగా మరో సినిమాని ప్రారంభించింది. ఈ సినిమాను తన హౌమ్ బ్యానర్ లో చేస్తుంది ఈ బ్యూటీ . కీర్తి తండ్రి ప్రముఖ మలయాళ నిర్మాత సురేష్ కుమార్ తల్లి మేనక ఈ ఇద్దరు కలిసి రేవతి కళామందిర్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి పలు చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు ఈ బ్యానర్ లో కీర్తి  ‘వాశి’ అనే టైటిల్ తో సినిమా చేస్తుంది. తాజాగా ఈ సినిమా పూజాకార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. విష్ణు జి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 26 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

4 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సొట్టబుగ్గల సుందరి.. కశ్మీర్‌లో షూటింగ్‌.

Priya Prakash Varrier: కైపెక్కించే కళ్లతో కుర్రాళ్ల మతిపోగొడుతున్న అందాల ప్రియా..

Anasuya Bharadwaj: చీర కట్టుతో ఫాన్స్ మనసులను దోచుకుంటున్న అను లేటెస్ట్ ఫొటోస్..