Poonam Pandey: ‘ఇది నిజంగా సిగ్గుచేటు’.. పూనమ్ పాండే మరణవార్తపై కస్తూరి శంకర్ కామెంట్స్..

|

Feb 04, 2024 | 10:29 PM

కేవలం తాను గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు ఇలా చేశానంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమెపై దేశప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీచమైన ఆలోచనలు అని.. పబ్లిసిటి కోసమే ఇలా చేస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు నకిలీ వార్తలను పోస్ట్ చేసినందుకు పూనమ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పూనమ్ పాండే నకిలీ మరణంపై పలువురు సినీ తారలు స్పందిస్తూ..

Poonam Pandey: ఇది నిజంగా సిగ్గుచేటు.. పూనమ్ పాండే మరణవార్తపై కస్తూరి శంకర్ కామెంట్స్..
Kasturi Sankar
Follow us on

బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే నకిలీ మరణవార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె సర్వైకల్ క్యాన్సర్ కారణంగా మరణించినట్లు ఇన్ స్టా వేదికగా ప్రకటించారు. దీంతో పూనమ్ మరణంపై సినీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. అయితే మరుసటి రోజు పూనమ్ తాను మరణించలేదని ఓ వీడియో రిలీజ్ చేసింది. కేవలం తాను గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు ఇలా చేశానంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమెపై దేశప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీచమైన ఆలోచనలు అని.. పబ్లిసిటి కోసమే ఇలా చేస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు నకిలీ వార్తలను పోస్ట్ చేసినందుకు పూనమ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పూనమ్ పాండే నకిలీ మరణంపై పలువురు సినీ తారలు స్పందిస్తూ.. ఆమె ప్రవర్తనపై సీరియస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే సౌత్ నటి కస్తూరి శంకర్ పూనమ్ పోస్ట్ పై ఆసక్తికర్ కామెంట్స్ చేసింది.

‘తన వయస్సు 32 సంవత్సరాలు అని చెప్పినప్పుడే నాకు అర్ధమైంది. అది ఫేక్ న్యూస్ అని.. కేవలం పబ్లిసిటి స్టంట్ అని.. ఎందుకంటే ప్రజలకు సర్వైకల్ క్యానర్ గురించి పూర్తిగా తెలుసు. దానికి కారణంగా ఏం జరుగుతుంది అనేది తెలుసు. పూనమ్ కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు తెలిసింది. కానీ క్యాన్సర్ జబ్బును ఇలా పబ్లిసిటి స్టంట్ కోసం ఉపయోగించడం నిజంగా సిగ్గుచేటు’ అంటూ రాసుకొచ్చారు.

సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలనేది పూనమ్ పాండే ఆలోచన అయినప్పటికీ, ఆమె చనిపోయిందని తప్పుడు వార్తలను ప్రచారం చేయడం వల్ల విమర్శలను ఎదుర్కొంటోంది. పూనమ్ హిందీ, తెలుగు చిత్రాల్లో నటించింది. సినిమాల ద్వారా కాకుండా వివాదాలతోనే పూనమ్ ఎక్కువగా వార్తలలో నిలిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.