వంటలక్కదే హవా..వన్ విమెన్ షో..మళ్లీ ఫస్ట్ ప్లేస్

|

Dec 14, 2019 | 11:49 AM

వంటలక్క.. తెలుగు లోగిళ్లలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 07:30 గంటలకు ‘స్టార్ మా’ లో ప్రసరమయ్యే ‘ కార్తీక దీపం’ సీరియల్ కోసం మహిళలు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల ఈ నాటికలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ మలయాళ టెలివిజన్ ధారావాహిక ‘కరుతముత్తు’ రీమేక్‌గా కార్తీకదీపం తెరకెక్కుతుంది. కాగా ప్రారంభం నుంచి ఈ సీరియల్ బుల్లితెర రేటింగ్స్‌లో సత్తా చాటుతుంది. ఇటీవల […]

వంటలక్కదే హవా..వన్ విమెన్ షో..మళ్లీ ఫస్ట్ ప్లేస్
Follow us on

వంటలక్క.. తెలుగు లోగిళ్లలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తోంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 07:30 గంటలకు ‘స్టార్ మా’ లో ప్రసరమయ్యే ‘ కార్తీక దీపం’ సీరియల్ కోసం మహిళలు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల ఈ నాటికలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ మలయాళ టెలివిజన్ ధారావాహిక ‘కరుతముత్తు’ రీమేక్‌గా కార్తీకదీపం తెరకెక్కుతుంది. కాగా ప్రారంభం నుంచి ఈ సీరియల్ బుల్లితెర రేటింగ్స్‌లో సత్తా చాటుతుంది.

ఇటీవల రిలీజ్ చేసిన  49వ వీక్ బార్క్ రేటింగ్స్‌ లో కూడా ‘కార్తీక దీపం’ ఫస్ట్ ప్లేస్ నిలబెట్టుకుంది.  49వ వారం 16053 ఇంప్రెషన్స్ సాధించిన ఈ క్రేజీ సీరియల్‌కు మరో ధారావాహిక ఏది దగ్గర్లో కూడా నిలవలేదు. ‘కోయిలమ్మ’ సీరియల్ ఇంప్రెషన్స్‌లో టాప్ ఫైవ్ నుంచి తప్పుకోవడం అనూహ్య పరిణామం. ‘వదినమ్మ’ నాటిక  10724 ఇంప్రెషన్స్‌తో 2వ స్థానానికి ఎగబాకింది. ‘గోరింటాకు’, ‘మౌనరాగం’ ధారావాహికలు వరుసగా  3, 4 స్థానాల్లో మంచి రేటింగ్స్‌కి సాధించాయి.