Jr NTR: ఎన్టీఆర్ వస్తున్నాడని ఆస్పత్రికి కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రిని పంపిన సీఎం

|

Jan 29, 2023 | 11:14 AM

జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌... బెంగళూరు నారాయణ హృదయాలకు చేరుకున్నారు. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌తోపాటు నారా బ్రాహ్మణి కూడా ఆస్పత్రికి వచ్చారు.

Jr NTR: ఎన్టీఆర్ వస్తున్నాడని ఆస్పత్రికి కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రిని పంపిన సీఎం
Jr Ntr And Family
Follow us on

బెంగళూరు నారాయణ హృదయాలకు జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌, నారా బ్రాహ్మణి సహా ఇతర కటుంబ సభ్యులు చేరుకున్నారు.  తారకరత్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు కుటుంబ సభ్యులు.  తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని డాక్టర్లు వారికి తెలిపారు. అవసరమైతే విదేశాల నుంచి ఎక్స్‌పర్ట్స్‌ను పిలిపించాలని వారు కోరినట్లు తెలుస్తుంది. కాగా ఎన్టీఆర్.. వస్తున్న విషయం తెలియడంతో.. నారాయణ హృదయాలకు కర్నాటక హెల్త్‌ మినిస్టర్‌ సుధాకర్‌‌ను పంపారు సీఎం బొమ్మై.  తారకరత్న హెల్త్‌ కండీషన్‌పై కర్నాటక హెల్త్‌ మినిస్టర్‌ ఆరా తీశారు. నారాయణ హృదయాలకు వచ్చి వైద్యులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులకు పూర్తి సమాచారం తెలియజేయాలని సీఎం.. మినిస్టర్‌ను ఆదేశించినట్లు తెలిసింది. తారక్, కళ్యాణ్ రామ్ ఆయనతో కూడా మాట్లాడారు.

ఎక్మో సపోర్ట్‌పైనే ఉన్నారు తారకరత్న. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివ్‌ కేర్‌ స్పెషలిస్టుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. అయితే, తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెబుతున్నారు. 48గంటలు గడిస్తేనే ఏమైనా చెప్పగలమంటున్నారు వైద్యులు.

కాగా జూనియర్ ఎన్టీఆర్‌కు కర్నాటక సీఎం బొమ్మై స్వతాహాగా అభిమాని. గతంలో కర్నాటక రాజ్యోత్సవ వేడుకలకు వెళ్లినప్పుడు తారక్‌కు రెడ్ కార్పెట్ పరిచారు. అంతేకాదు ఎన్టీఆర్‌ను స్వయంగా ఇంటికి ఆహ్వానించి..  సత్కరించి.. ఆతిథ్యం ఇచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం