
లేచినా.. తుమ్మినా.. దగ్గినా.. గునిగినా…! ట్విట్టర్లో తిన్నగా.. అప్డేట్ చేసే బాలీవుడ్ సెల్రబిటీస్ కాస్త తమ ఈగర్‌ను తగ్గించుకుంటున్నారు. సాధ్యమైనంత దూరంగా.. ట్విట్టర్‌కు దూరం ఉంటే బెటర్ అని ఫీలవుతున్నారు. బ్యాన్స్.. బాయ్ కాట్ ఎఫెక్ట్ తమపై పడకుండా.. ట్రోల్స్ తో తమలోని పాజిటివిటీని పాడు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక కరణ్ కూడా ఇదే బాటలో నడించేందుకు ఫిక్స్ అయ్యారు. గుడ్ బై టూ ట్విట్టర్ అంటూ.. ఓ లాస్ట్ ట్వీట్ చేసి అందర్నీ షాక్ ఇచ్చేశారు. కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఈయన పేరు గట్టిగా నే పినిపిస్తోంది. అక్కడ ప్రోడ్యూసర్ గా… డైరెక్టర్ గా.. షో హోస్ట్ గా స్టార్ డమ్ కమాయించిన కరణ్.. రీసెంట్ డేస్లో ట్విట్టర్ మూలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడో మాట్లాడని మాటలతో…. ఇంకొప్పుడో.. ట్వీట్టర్లో రాసుకొచ్చిన పదాలతో ట్రోల్ అవుతున్నారు. తన సినిమాలపై వస్తున్న బ్యాన్.. బాయ్ కాట్ హ్యాష్ ట్యాగ్‌లకు ప్రత్యక్షంగా .. పరోక్షంగా కారణం అవుతున్నారు.
ఇక అందుకే అన్నట్టు.. ట్విట్టర్ కు గుడ్ బాయ్ చెప్పారు కరణ్. తాజాగా తన లాస్ట్ ట్వీట్ చేశారు. మరింత పాజిటివ్ ఎనర్జీని పొందేందుకు ఒక అడుగు ముందుకు! గుడ్ బై ట్విట్టర్ అంటూ.. ఆ ట్వీట్లో రాసుకొచ్చారు. ఇక ఈ విషయం నెట్టింట వైరల్ అవడంతో.. కరణ్ దెబ్బకు ట్విట్టర్ కు దండం పెట్టారని అంటున్నారు నెటిజన్లు. అంతేకాదు.. ఇక చస్తే.. ట్విట్టర్ వేదికగా ఎవ్వరినీ గెలకడంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు. కరణ్ జోహార్ ఇటీవలే లైగర్ సినిమా బాలీవుడ్ లో రిలీజ్ చేశారు. అలాగే బ్రహ్మాస్త్ర టాలీవుడ్ ప్రమోషన్స్ లోనూ కరణ్ జోహార్ పాల్గొని సందడి చేశారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.