
పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. తమిళం, కన్నడ, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ నటనపై ఆసక్తితో లక్షలు జీతం వచ్చే ఉద్యోగాలను వదిలేసింది. బిజినెస్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ కంప్లీట్ చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత ఐటీసీ, విప్రోలో ఉద్యోగాలు చేసింది. నటనపై ఇంట్రెస్ట్ ఉండడంతో నెలకు లక్షలు వచ్చే ఉద్యోగాలు వదిలేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తమిళంతో సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. తెలుగులో ఒక్క సినిమా చేసింది. కానీ అంతగా క్లిక్ అవ్వలేదు. తాజాగా హిమాలయాల్లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లో పాల్గొంది. జీవితంలోనూ సమున్నత శిఖరాలు చేరుకోవడం తన లక్ష్యమని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవర తెలుసా.. ? తనే అర్చనా సింగ్.
ఎంబీఏ కంప్లీట్ చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత విప్రో, ఐటీసీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో పనిచేసింది. అంతేకాకుండా కింగ్ ఫిషర్, జెయ్ ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టెస్ గా పనిచేసింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అర్చనా.. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో సినిమాలు చేసింది. తెలుగులో దమయంతి- కౌశిక్ వర్మ అనే చిత్రంలో నటించింది. ఈసినిమా అంతగా క్లిక్ అవ్వలేదు. దీంతో తెలుగులో ఈ బ్యూటీకి క్రేజ్ రాలేదు. అలాగే మిగతా భాషలలో ఆమె నటించిన చిత్రాలు సైతం హిట్ కాకపోవడంతో అర్చనకు ఆఫర్స్ రాలేదు.
అర్చన క్లాసికల్ డ్యాన్సర్. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే అటు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కెరీర్ తొలినాళ్లలో తను చేసిన ఉద్యోగాలు.. ఆ తర్వాత దక్షిణది అన్ని భాషలలో చేస్తున్న సినిమాలు ఇచ్చిన కిక్ కంటే ఎవరెస్ట్ ఎక్కడం తనకు మరింత కిక్ ఇచ్చిందని చెప్పుకొచ్చింది. జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే పట్టుదలను, ప్రోత్సాహాన్ని ఇచ్చిందని.. తనకు తెలియకుండానే తనలో ఉన్న బెరుకును, భయాన్ని ఈ సాహస యాత్ర పటాపంచలు చేసిందని తెలిపింది. అలాగే ఈ అనుభవాన్ని , అనుభూతిని మాటల్లో చెప్పడం కష్టమని తెలిపింది.
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..
Nagarjuna: టాలీవుడ్‌ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..
Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..
OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..