
సౌత్ ఇండస్ట్రీ బిగ్ సూపర్ స్టార్ కమల్ హాసన్ సినిమాల కోసం ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా ఎదుచూస్తునారు. కమల్ 5 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నారు. 2022లో విడుదలైన కమల్ హాసన్ విక్రమ్ భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు 2024 సంవత్సరం కమల్ హాసన్ కెరీర్‌లో భారీ సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది రెండు భారీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆయన రెండు సినిమాలు దాదాపు రెండు వారాల్లో విడుదల కానున్నాయి. ఒకవైపు కల్కి 2898లో విలన్‌గా చేస్తూనే మరోవైపు ఇండియన్ 2 చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు కమల్. ఇప్పటికే కల్కి రిలీజ్ డేట్ వచ్చేసింది, ఇప్పుడు ఇండియన్ 2 రిలీజ్ డేట్ కూడా వచ్చింది.
ఇండియన్ 2 సినిమా చాలా స్పెషల్ అనే చెప్పాలి. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. భారతీయుడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనేక కారణాల వల్ల సినిమా విడుదల తేదీపై సందేహాలు నెలకొన్నాయి. ఎన్నికలు, ఐపీఎల్ కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదలపై అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. ఈ చిత్రం జూలై 12న థియేటర్లలోకి రానుంది భారతీయుడు 2. కమల్ ఈ సినిమా కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
‘వణక్కమ్ ఇండియా. కమల్ హాసన్ చిత్రం ఇండియన్ 2 ఫస్ట్ సింగిల్ 22 మే 2024న విడుదల కానుంది. దీనికి రాక్‌స్టార్ అనిరుధ్ సంగీతం అందించారు. సేనాపతి పునరాగమనానికి సిద్ధంగా ఉండండి. ఈ చిత్రం జూలై 12, 2024న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది అని సోషల్ మీడియాలో పోస్ట్ రిలీజ్ చేశారు మేకర్స్.అలాగే ఈ సినిమా బ్యాక్‌సైడ్ లుక్ కూడా రివీల్ చేశారు. ఇందులో కమల్ హాసన్ చేతిలో గొడ్డలి పట్టుకుని గుర్రపు స్వారీ చేస్తూ కనిపిస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
Vanakkam INDIA! 🇮🇳 The 1st single from INDIAN-2 in Rockstar ANIRUDH musical is dropping on May 22nd! 🥁 Get ready to welcome the comeback of SENAPATHY! 🤞🏻 Releasing worldwide in cinemas 12th July 2024! 🎬🤩#Indian2 🇮🇳 #Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh… pic.twitter.com/9xcsaDTVf5
— Lyca Productions (@LycaProductions) May 19, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.