AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharateeyudu 2 : భారతీయుడు వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

2022లో విడుదలైన కమల్ హాసన్ విక్రమ్ భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు 2024 సంవత్సరం కమల్ హాసన్ కెరీర్‌లో భారీ సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది రెండు భారీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆయన రెండు సినిమాలు దాదాపు రెండు వారాల్లో విడుదల కానున్నాయి. ఒకవైపు కల్కి 2898లో విలన్‌గా చేస్తూనే మరోవైపు ఇండియన్ 2 చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు కమల్.

Bharateeyudu 2 : భారతీయుడు వచ్చేస్తున్నాడు.. రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
Indian 2
Rajeev Rayala
|

Updated on: May 20, 2024 | 3:33 PM

Share

సౌత్ ఇండస్ట్రీ బిగ్ సూపర్ స్టార్ కమల్ హాసన్ సినిమాల కోసం ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా ఎదుచూస్తునారు. కమల్  5 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నారు. 2022లో విడుదలైన కమల్ హాసన్ విక్రమ్ భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు 2024 సంవత్సరం కమల్ హాసన్ కెరీర్‌లో భారీ సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది రెండు భారీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆయన రెండు సినిమాలు దాదాపు రెండు వారాల్లో విడుదల కానున్నాయి. ఒకవైపు కల్కి 2898లో విలన్‌గా చేస్తూనే మరోవైపు ఇండియన్ 2 చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు కమల్. ఇప్పటికే కల్కి రిలీజ్ డేట్ వచ్చేసింది, ఇప్పుడు ఇండియన్ 2 రిలీజ్ డేట్ కూడా వచ్చింది.

ఇండియన్ 2 సినిమా చాలా స్పెషల్ అనే  చెప్పాలి. దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. భారతీయుడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనేక కారణాల వల్ల సినిమా విడుదల తేదీపై సందేహాలు నెలకొన్నాయి. ఎన్నికలు, ఐపీఎల్ కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదలపై అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. ఈ చిత్రం జూలై 12న థియేటర్లలోకి రానుంది భారతీయుడు 2. కమల్ ఈ సినిమా కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

‘వణక్కమ్ ఇండియా. కమల్ హాసన్ చిత్రం ఇండియన్ 2 ఫస్ట్ సింగిల్ 22 మే 2024న విడుదల కానుంది. దీనికి రాక్‌స్టార్ అనిరుధ్ సంగీతం అందించారు. సేనాపతి పునరాగమనానికి సిద్ధంగా ఉండండి. ఈ చిత్రం జూలై 12, 2024న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది అని సోషల్ మీడియాలో పోస్ట్ రిలీజ్ చేశారు మేకర్స్.అలాగే  ఈ సినిమా బ్యాక్‌సైడ్ లుక్ కూడా రివీల్  చేశారు. ఇందులో కమల్ హాసన్ చేతిలో గొడ్డలి పట్టుకుని గుర్రపు స్వారీ చేస్తూ కనిపిస్తున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పొలంలో పని చేస్తుండగా పంజా విసిరిన చిరుతపులి.. ఆ తర్వాత..
పొలంలో పని చేస్తుండగా పంజా విసిరిన చిరుతపులి.. ఆ తర్వాత..
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి గిఫ్ట్
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి గిఫ్ట్
రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చూడగా..
రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చూడగా..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..