Bharateeyudu 2: కమల్ హాసన్ కోసం కదలిరానున్నతారలు.. భారతీయుడు 2 ప్రీ రిలీజ్ కు ఆ స్టార్ హీరోలు

|

May 24, 2024 | 4:54 PM

లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 సినిమా చేస్తున్నాడు. దాదాపు 23 ఏళ్ల క్రితం తెరకెక్కిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది.

Bharateeyudu 2: కమల్ హాసన్ కోసం కదలిరానున్నతారలు.. భారతీయుడు 2 ప్రీ రిలీజ్ కు ఆ స్టార్ హీరోలు
Baratheeyudu 2
Follow us on

లోకనాయకుడు కమల్ హాసన్ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఎలాంటి పాత్రలైన అవలీలగా చేసే కమల్ హాసన్ చివరిగా విక్రమ్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 సినిమా చేస్తున్నాడు. దాదాపు 23 ఏళ్ల క్రితం తెరకెక్కిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరపనున్నారు శంకర్. ఈ ఈవెంట్ చెన్నై లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి చాలా మంది సినీ సెలబ్రెటీలు హాజరుకానున్నారని తెలుస్తోంది. అన్ని ఇండస్ట్రీల నుంచి సూపర్ స్టార్స్ ఈ ఈవెంట్ కు హాజరుకానున్నారని టాక్. తెలుగు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, రామ్ చరణ్, బాలీవుడ్ నుంచి యంగ్ హీరో రణవీర్ సింగ్ , అలాగే మలయాళ ఇండస్ట్రీ నుంచి మోహన్ లాల్ ఇలా చాలా మంది ఈ ఈవెంట్ కు హాజరు కానున్నారని తెలుస్తోంది.

శంకర్ భారతీయుడు సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే సిద్దార్థ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. జూన్ 1న భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను జులై 12న తెలుగు, తమిళంతోపాటు హిందీ భాషలో ప్రేక్షకుల ముందుకుతీసుకురానున్నారు. ఈ సినిమాతో పాటు శంకర్ రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ అనే సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. భారతీయుడు 2 సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

శంకర్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.