Kamal Haasan: విక్రమ్ దర్శకుడికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన కమల్ హాసన్.. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్స్‌కు కూడా..

లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) నటించిన విక్రమ్(Vikram) సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న లోకేష్ కానగరాజ్..

Kamal Haasan: విక్రమ్ దర్శకుడికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన కమల్ హాసన్.. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్స్‌కు కూడా..
Kamal Haasan

Updated on: Jun 07, 2022 | 6:11 PM

లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) నటించిన విక్రమ్(Vikram) సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కమల్ హాసన్ కంప్లీట్ యాక్షన్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. విక్రమ్ సినిమాపై మొదటి నుంచి కూడా పాజిటివ్ బజ్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. అయితే మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నట్లే మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ఇక చాలా రోజుల తర్వాత కమల్ హాసన్ అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ సూపర్ హిట్ కొట్టేశారు. తెలుగులోనూ ఈ సినిమా భారీ వసూళ్లలను రాబడుతుంది.

విక్రమ్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు కమల్. తనకు ఇంతటి భారీ విజయాన్ని అందించిన దర్శకుడు లోకేష్ కానగరాజ్ ను కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు కమల్. ఖరీదైన కారును కమల్ లోకేష్ కు బహుమతిగా ఇచ్చారు. అంతే కాదు 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ కు అపాచీ 160 ఆర్.టీ.ఆర్ బైకులను గిఫ్ట్ గా ఇచ్చారు . సూపర్ హిట్ గా నిలిచిన విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించగా ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించారు. అలాగే స్టార్ హీరో సూర్య చిన్న పాత్రలో మెరిశారు.

ఇవి కూడా చదవండి