Pawan Kalyan: గర్వంగా ఉంది బ్రదర్.. పవన్ కళ్యాణ్ పై కమల్ హాసన్ రియాక్షన్

నాడు ఓటమితో కుంగిపోలేదు..నేడు గెలుపుతో పొంగిలేదు..అంటున్న పవన్ కల్యాణ్ రాజకీయం రహదారి కాదు ముళ్లదారి. అలాంటి దారిలో తానెలా నెగ్గుకొచ్చాడు. రెండు చోట్ల ఓడిపోయిన రాజకీయనాయకుడు. పార్టీ పెట్టి అప్పటికే ఐదారేళ్లయింది..కేడర్‌ బలంగా లేదు. పార్టీకి పునాది అంతగా లేదు. ప్రత్యర్ధుల విమర్శలు..అయినా వెనకడుగు వేయలేదు. ఎంత కచ్చిగా తనపై విమర్శనాస్త్రాలు సంధించారో..అంత కసిగా రాజకీయంలో రాటుదేలారు. 2024లో పవన్ తీసుకున్న రాజకీయ వ్యూహాలు అనూహ్యం.

Pawan Kalyan: గర్వంగా ఉంది బ్రదర్.. పవన్ కళ్యాణ్ పై కమల్ హాసన్ రియాక్షన్
Pawan Kalyan

Updated on: Jun 08, 2024 | 10:21 AM

కొన్ని సార్లు రావడం లేటవచ్చా..కానీ రావడం పక్కా. .ఎవడైతే వందకు వందశాతం విజయం సాధిస్తుందో అదే జనసేన. వావ్..లాస్ట్ పంచ్ మనదే అయితే ఆకిక్కే వేరు కదా..ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాంటి కిక్కునే అనుభవిస్తున్నారు. అలాగని ఇదేమీ లాస్ట్ పంచ్ కాదు..ఇది జస్ట్ ట్రయిలే అన్నది జనసేన అధ్యక్షుడి మాట. నాడు ఓటమితో కుంగిపోలేదు..నేడు గెలుపుతో పొంగిలేదు..అంటున్న పవన్ కల్యాణ్ రాజకీయం రహదారి కాదు ముళ్లదారి. అలాంటి దారిలో తానెలా నెగ్గుకొచ్చాడు. రెండు చోట్ల ఓడిపోయిన రాజకీయనాయకుడు. పార్టీ పెట్టి అప్పటికే ఐదారేళ్లయింది..కేడర్‌ బలంగా లేదు. పార్టీకి పునాది అంతగా లేదు. ప్రత్యర్ధుల విమర్శలు..అయినా వెనకడుగు వేయలేదు. ఎంత కచ్చిగా తనపై విమర్శనాస్త్రాలు సంధించారో..అంత కసిగా రాజకీయంలో రాటుదేలారు. 2024లో పవన్ తీసుకున్న రాజకీయ వ్యూహాలు అనూహ్యం. తాను తగ్గినా పార్టీని గెలవాలన్న సంకల్పంతో పొత్తు అడుగులు వేశారు. ఆపొత్తుకోసం ఎన్నో కసరత్తులు చేశారు..

ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ విజయం సాధించారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు జనసేనాని. పవన్ కళ్యాణ్ విజయం పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు పవన్ విజయాన్ని పండగలా జరుపుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసిన పవన్ కళ్యాణ్ పేరే వినిపిస్తుంది. ఎక్కడ చూసిన ఆయన ఫోటోనే కనిపిస్తుంది. సినిమా సెలబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు.

మహేష్ బాబు, ఎన్టీఆర్, దళపతి విజయ్, రజినీకాంత్ లాంటి స్టార్ హీరోలు పవన్ కు విషెస్ తెలిపారు. ఎన్నికల్లో ఆయన సాధించిన విజయాన్ని కొనియాడారు. తాజాగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూడా పవన్ కళ్యాణ్ ను అభినందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు కమల్. “ఎన్నికల్లో విజయం అందుకున్న పవన్‌ కల్యాణ్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని తెలిపారు కమల్. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఆయన చేస్తున్న ప్రయాణానికి ఆల్‌ ది బెస్ట్‌.. మేమిద్దరం మాట్లాడుకుంటూ ఎమోషనల్‌ అయ్యాం’’ అని తెలిపారు. అదేవిధంగా ‘‘మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది బ్రదర్‌’’ అని రాసుకొచ్చారు కమల్. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పవన్ అభిమానులు ఈ ట్వీట్ ను తెగ షేర్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.