ఆఫ్టర్ మెనీ ఇయర్స్.. దద్దరిల్లిపోయే హిట్టు కొట్టారు లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan). అభిమానులు తననుంచి ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో అలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కమల్. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. విక్రమ్ సినిమాతో తన యాక్టింగ్లోని గ్రేస్ ఏంటో మరో సారి అందరికీ చూపించారు. ఇంటెన్సివ్ యాక్టింగ్తో .. స్టార్ క్యాస్టింగ్ సపోర్ట్‌తో బాక్సాఫీస్ ముందు విక్రమ్ సినిమాను నెంబర్ 1గా నిలిపారు. అయితే విక్రమ్ ఈ రేంజ్ హిట్టు కొట్టిన సందర్భంగా అందరికీ థ్యాంక్స్ చెబుతూ.. ఓ వీడియాను రిలీజ్ చేశారు కమల్. అదే వీడియోలో తమ్ముడు సూర్యతో తాను చేసే నెక్ట్స్ ఫిల్మ్ దద్దరిల్లిపోతుందంటూ.. క్రేజీ కామెంట్ చేశారు. ఆ కామెంట్స్‌తో నెట్టింట వైరల్ అవుతున్నారు కమల్.
జెస్ట్ 3 నిముషాలు మాత్రమే విక్రమ్ సినిమాలో కనిపించిన హీరో సూర్య.. సినిమా గ్రాఫ్‌ను ఒక్క సారిగి పెంచేశారు. అంతేకాదు.. విక్రమ్‌కు సీక్వెల్ పై ఇప్పటి నుంచే ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేశారు. ఇక తాజాగా కమల్ చెప్పిన మాటలతో విక్రమ్ సినిమా సీక్వెల్ పై మరింత ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేశారు. ఆ స్పెషలన్ వీడియోలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, హీరోలు విజయ్ సేతుపతి, ఫహాద్ కు థాంక్స్ చెప్పిన కమల్ .. సూర్యకు మాత్రం తన నెక్ట్స్ సినిమాతో సెపరేట్ గా స్పెషల్ థాంక్స్ చెబుతా అన్నారు. అంతేకాదు తమ్ముడు సూర్యతో తాను చేసే నెక్ట్స్ ఫిల్మ్ దద్దరిల్లిపోతుందంటూ హింటిచ్చారు.