Bharateeyudu 2: కమల్ హాసన్ భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనా..?

|

Mar 10, 2023 | 8:50 AM

ఎప్పుడో ఆగిపోయిన భారతీయుడు 2 సినిమా ఇటీవలే పట్టాలెక్కింది. కమల్ కెరీర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన భారతీయుడు సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది.

Bharateeyudu 2: కమల్ హాసన్ భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనా..?
Bharateeyudu 2
Follow us on

లోకనాయకుడు కమల్ హాసన్ రీసెంట్ గా విక్రమ్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన విక్రమ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ అందుకోవడమే కాకుండా వసూళ్లు కూడా బాగానే రాబట్టింది. ఇక ఇప్పుడు కమల్ నెక్ట్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు ఆయన ఫ్యాన్స్.. అయితే ఎప్పుడో ఆగిపోయిన భారతీయుడు 2 సినిమా ఇటీవలే పట్టాలెక్కింది. కమల్ కెరీర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన భారతీయుడు సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. ఎన్నో అంచనాల మధ్య ప్రారంభమైన ఈ మూవీ పలు కారణాల వలన తాత్కాలికంగా చిత్రీకరణ ఆగిపోయింది..

అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే భారతీయుడు 2 చిత్రాన్ని ఈ ఏడాది దీపావళికి థియేటర్లలోకి రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.  నవంబర్ 9 లేదా 10వ తేదీన ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతుందని అంటున్నారు.

ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు వచ్చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటే శంకర్ భారతీయుడు 2 ను కూడా పూర్తి చేస్తున్నారు.