Kamal Haasan: ముదిరిన వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన కమల్ హాసన్..

కమల్‌ హాసన్‌ థగ్‌ లైఫ్‌ సినిమాను కర్నాటకలో రిలీజ్‌ చేయరాదని కర్నాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ నిర్ణయించింది. కన్నడ భాషపై కమల్‌ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని ఫిల్మ్‌ ఛాంబర్‌ స్పష్టం చేసింది. దీంతో సినిమా విడుదలకు అడ్డంకులు లేకుండా చూడాలని కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు కమల్‌ హాసన్‌.

Kamal Haasan: ముదిరిన వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన కమల్ హాసన్..
Kamal Haasan

Updated on: Jun 03, 2025 | 7:50 AM

కన్నడంపై కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలపై కర్నాటకలో వివాదం మరింత రాజుకుంది. తమిళం నుంచే కన్నడం పుట్టిందన్న వ్యాఖ్యలపై కమల్‌ హాసన్‌ వెనక్కి తగ్గకపోవడంతో కన్నడ సినీ పరిశ్రమం భగ్గుమంది. కమల్‌ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పకపోవడంతో ఆయన నటించిన థగ్‌ లైఫ్‌ సినిమాను కర్నాటకలో విడుదల చేయరాదని నిర్ణయించారు. థగ్‌ లైఫ్‌ సినిమాపై కర్నాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ బ్యాన్‌ విధించడంతో వివాదం మరింత ముదిరింది. అయితే కన్నడంపై ప్రేమ తోనేఅలా మాట్లాడానని అంటున్నారు కమల్‌ హాసన్‌. తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతానన్నారు. ప్రేమతోనే అలా మాట్లాడానని, ప్రేమ ఎన్నడూ క్షమాపణ చెప్పదన్నారు. భాష చరిత్ర గురించి ఎంతోమంది చరిత్రకారులు తనకు చెప్పారని, తన వ్యాఖ్యల్లో మరో ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు.

థగ్‌ లైఫ్‌ సినిమా విడుదల కోసం కమల్‌ హాసన్‌ కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. సినిమా విడుదలకు అవకాశం ఇవ్వాలని, రక్షణ కల్పించాలని పిటిషన్‌లో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, కన్నడ ఫిల్మ్ ఛాంబర్ సహా పలు ఇతర సంస్థలను ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్. కర్నాటకలో జ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. తన సినిమా స్క్రీనింగ్‌కు తగిన భద్రత కల్పించేలా డీజీపీ, సిటీ పోలీస్‌ కమిషనర్‌కు సూచనలు జారీ చేయాలని కమల్‌ హాసన్‌ కోరారు. అయితే కమల్‌ హాసన్‌ క్షమాపణలు చెబితేనే సినిమా విడుదల అవుతుందని మరోసారి ఫిల్మ్‌ ఛాంబర్‌ స్పష్టం చేసింది.

ఈనెల 5వ తేదీన దేశవ్యాప్తంగా థగ్‌ లైఫ్‌ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కర్నాటకలో మాత్రం విడుదలపై సందిగ్థత నెలకొంది. కమల్ పిటిషన్‌పై కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ కన్పిస్తోంది. దాదాపు 35 ఏళ్ల తర్వాత డైరెక్టర్ మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..