సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నారు. చాలా కాలం గ్యాప్ తర్వాత విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజ్..బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. విడుదలైన మొదటి రోజు నుంచి ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ కార్తీక్ దండు తెరకెక్కించిన ఈ చిత్రంలో తేజ్ సరసన సంయుక్త మీనన్ కథనాయికగా నటించింది. విడుదలైన ఎనిమిది రోజుల్లోనే దాదాపు 60 కోట్లకు పైగా కలెక్షన్సా్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమాతోపాటు.. చిత్రయూనిట్ పై సినీప్రియులే కాకుండా.. సెలబ్రెటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై మెగా హీరోస్ స్పందించగా.. తాజాగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తన ట్విట్టర్ వేదికగా సాయి ధరమ్ తేజ్, డైరెక్టర్ కార్తీక్ దండుపై ప్రశంసలు కురిపించారు. అలాగే హీరోయిన్ సంయుక్త నటనను మరోసారి మెచ్చుకున్నారు. ఇక కళ్యాణ్ రామ్ ట్వీట్ కు తేజ్ స్పందిస్తూ.. థాంక్యూ సో మచ్ అన్నా అంటూ రిప్లై ఇచ్చాడు. అలాగే సంయుక్త మీనన్ సైతం ఎమోషనల్ అయ్యింది. నేను నందిని పాత్రను ఎంతగా ఇష్టపడ్డానో మీకు తెలుసు అయితే ఒకే రోజు విరూపాక్ష, డెవిల్ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు మీరు నన్ను సపోర్ట్ చేశారంటూ భావోద్వేగా ట్వీట్ చేసింది. కళ్యాణ్ రామ్ సరసన ఇదివరకే బింబిసార చిత్రంలో నటించారు సంయుక్త.
ఇదిలా ఉంటై.. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో మరోసారి కళ్యాణ్ రామ్ తో జతకడుతుంది సంయుక్త. తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ గోల్డెన్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంటుంది సంయుక్త.
Loved #Virupaksha.
So happy for my brother @IamSaiDharamTej ❤️.
This film will be special in your career @iamsamyuktha_.@karthikdandu86 your script and it’s execution is very good.@AJANEESHB delivered his best and showed his class with the music.
The technical team…
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) April 23, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.