Prabhas: ఏమున్నాడ్రా బాబు.. స్టైలీష్ లుక్‏తో అదరగొట్టిన డార్లింగ్.. అమ్మాయిల హార్ట్ చోరీ..

ఇప్పటివరకు విడుదలైన టీజర్, పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. ఇక ఇందులో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలకు చెందిన పలువురు స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. రూ.600 కోట్ల బడ్జెట్‏తో వైజయంతి బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

Prabhas: ఏమున్నాడ్రా బాబు.. స్టైలీష్ లుక్‏తో అదరగొట్టిన డార్లింగ్.. అమ్మాయిల హార్ట్ చోరీ..
Prabhas

Updated on: Jun 19, 2024 | 3:26 PM

కల్కి 2898 ఏడీ సినిమా కోసం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తుండడంతో ముందు నుంచి ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. అలాగే మహానటి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తెరకెక్కించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పుడు ప్రభాస్ తో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో అనే క్యూరియాసిటీ ఉండిపోయింది. దీంతో కల్కి చిత్రాన్ని చూసేందుకు అడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్, పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై మరిన్ని అంచనాలను పెంచేశాయి. ఇక ఇందులో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలకు చెందిన పలువురు స్టార్స్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. రూ.600 కోట్ల బడ్జెట్‏తో వైజయంతి బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈరోజు (జూన్ 19)న ముంబైలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు రెడీ అయ్యింది చిత్రయూనిట్. ఇందుకోసం ఇప్పటికే మూవీ టీమ్ మొత్తం ముంబై వెళ్లింది. ఇక డార్లింగ్ కూడా ముంబై వెళ్లాడు. నిన్న రాత్రి ప్రభాస్ ముంబై చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రభాస్ సరికొత్త లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఇన్నాళ్లు కాస్త బొద్దుగా కనిపించిన డార్లింగ్.. ఇప్పుడు కాస్త సన్నగా కనిపించాడు. డార్లింగ్ న్యూలుక్ చూసి ఏమున్నాడ్రా బాబు.. కటౌట్ అదిరిందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇవాళ ముంబైలో జరిగే కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్, మూవీ టీం పాల్గొననున్నారు. ఈ ఈవెంట్ సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ కానుంది. ఈ ఈవెంట్ కేవలం వైజయంతి నెట్ వర్క్ యూట్యూబ్ ఛానల్ లో మాత్రమే లైవ్ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.