Kalki 2898 AD: కల్కి లో భైరవగా ప్రభాస్.. డార్లింగ్ నయా లుక్ మాములుగా లేదుగా

|

Mar 08, 2024 | 6:46 PM

దాదాపు ఆరేళ్ళ తర్వాత సలార్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ కల్కి సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ అందాల భామ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది.

Kalki 2898 AD: కల్కి లో భైరవగా ప్రభాస్.. డార్లింగ్ నయా లుక్ మాములుగా లేదుగా
Kalki 2898
Follow us on

పాన్  ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా కల్కి 2898 AD. ఇటీవలే ప్రభాస్ సలార్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. దాదాపు ఆరేళ్ళ తర్వాత సలార్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ కల్కి సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ అందాల భామ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కల్కి సినిమానుంచి ప్రభాస్ లుక్ ను రిలీజ్ చేశారు.

మహా శివ రాత్రి సందర్భంగా కల్కి సినిమానుంచి ప్రభాస్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో డార్లింగ్ భైరవ అనే పాత్రలో కనిపించనున్నాడు. గతంలో రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు వదిలిన లుక్ కూడా సినిమా పై అంచనాలను రెట్టింపు చేసింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాను చాలా డిఫరెంట్ కథతో తెరకెక్కిస్తున్నాడు నాగ్ అశ్విన్. ఇందుకోసం ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. కల్కి సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని కూడా నటిస్తుంది. రీసెంట్ గా ఇటలీలో ఇద్దరి పై సాంగ్ ను చిత్రీకరించారట. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో డార్లింగ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. అలాగే సలార్ 2 తోపాటు మారుతి దర్శకత్వంలో వస్తున్న రాజా సాబ్ సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటుంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు డార్లింగ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.