Kalki 2898 AD: కల్కి సినిమాలో అసలు విలన్ ఆయన కాదు.. సీక్రెట్ బయట పెట్టిన కల్కి టీమ్ మెంబర్

|

Jul 22, 2024 | 5:17 PM

రెబల్ స్టార్ ప్రభాస్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో అలా చూపించాడు నాగీ. కల్కి సినిమాతో ప్రభాస్ కెరీర్ లో మరో సంచలన విజయం అందుకున్నాడు. కల్కి సినిమాలో ప్రభాస్ తన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ కనిపించారు. అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ ఈ మూవీలో చాలా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను మహాభారత నేపథ్యంలో తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్.

Kalki 2898 AD: కల్కి సినిమాలో అసలు విలన్ ఆయన కాదు.. సీక్రెట్ బయట పెట్టిన కల్కి టీమ్ మెంబర్
Kalki 2898ad
Follow us on

దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898ఎడి సినిమా భారీ హిట్ అందుకొని తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు పైకి ఎక్కించింది. రెబల్ స్టార్ ప్రభాస్ ను ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో అలా చూపించాడు నాగీ. కల్కి సినిమాతో ప్రభాస్ కెరీర్ లో మరో సంచలన విజయం అందుకున్నాడు. కల్కి సినిమాలో ప్రభాస్ తన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ కనిపించారు. అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ ఈ మూవీలో చాలా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను మహాభారత నేపథ్యంలో తెరకెక్కించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇక కల్కి సినిమా చాలా పార్ట్ లుగా తెరకెక్కిస్తున్నాం అని తెలిపారు. ఇప్పటికే పార్ట్ 2కి సంబందించిన షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయ్యిందని మేకర్స్ తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా కల్కి సినిమా గురించి కొన్ని సీక్రెట్స్ బయట పెట్టాడు మూవీ టీమ్ మెంబర్..

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8లో ఊహించని ఎంట్రీ.. హౌస్‌లో అడుగుపెట్టనున్న హాట్ బ్యూటీ..!

ఈ సినిమాలో కలికి , కల్కి మధ్య యుద్ధం జరుగుతుందని చూపించనున్నారు. కలిని అంతం చేయడానికి మహావిష్ణువు కల్కి అవతారంలో జన్మిస్తారు. అదే ఈ సినిమా కథలో చూపించనున్నారు. కల్కి పార్ట్ వన్ చూసిన వారు కమల్ హాసన్ కలి అని అనుకుంటారు. కానీ నిజానికి ఆయన కలి కాదట. ఈ విషయన్ని కల్కి మూవీ ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహానీ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆయన మాట్లాడుతూ..

ఇది కూడా చదవండి : Prabhas: ప్రభాస్ సినిమా కోసం పాకిస్థాన్ హీరోయిన్‌ను దింపుతున్నారా.?

కల్కి సినిమాలో కమల్ హాసన్ ను సుప్రీమ్ యాస్కిన్ గా చూపించారు. నిజానికి ఆయన కలి కాదు. కలి కింద యాస్కిన్ పని చేస్తుంటాడు. అలాగే కాంప్లెక్స్ అనేది ఒక్కటి కాదు అలా ఏడు కాంప్లెక్స్ లు ఉంటాయట. ఆ ఏడు కాంప్లెక్స్ లను యాస్కిన్ చూసుకుంటాడట. అతడిని కంటికి కనిపించని శక్తి అయిన కలి నడిపిస్తుంటాడని ఆయన అన్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే కల్కి సినిమాను ఏడు పార్ట్ లుగా తెరకెక్కించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే సెకండ్ పార్ట్ లో సుప్రీం యాష్కిన్ పాత్ర ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. కల్కి మూవీ ప్రొడక్షన్ డిజైనర్ చెప్పిన దాని ప్రకారం కలి, సుప్రీం యాష్కిన్ ఇద్దరూ వేరు వేరు అని తెలుస్తోంది. మరి దర్శకుడు కల్కి మిగిలిన పార్ట్స్ ను ఎలా చూపిస్తాడో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.