Kalki 2898 AD: ‘కల్కి 2’ షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే.. అసలు విషయం చెప్పిన నిర్మాత.

|

Aug 30, 2024 | 9:03 AM

డైరెక్టర్ మేకింగ్, ప్రభాస్ యాక్టింగ్, విజువల్ ఎఫెక్ట్ పై సినీ విశ్లేషకులు ప్రశంసలు కురిపించారు. ఇక ఈ మూవీకి సీక్వెల్ పార్ట్ ఉందన్న సంగతి తెలిసిందే. కల్కి 2 కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే కల్కి 2 గురించి పలుమార్లు హింట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా సెకండ్ పార్ట్ పై నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంకదత్ లు స్పందించారు.

Kalki 2898 AD: కల్కి 2  షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే.. అసలు విషయం చెప్పిన నిర్మాత.
Kalki 2
Follow us on

ఇటీవల పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన సినిమా కల్కి 2898 AD. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లలో ప్రభంజనం సృష్టించింది. భారీ అంచనాల మధ్య జూన్ 27న విడుదలైన ఈ మూవీ దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో బీటౌన్ స్టార్ అమితాబ్, దీపికా పదుకొణే, దిశా పటానీ, దుల్కర్ సల్మాన్, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, శోభన, మాళవిక నాయర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అంతేకాకుండా మలయాళం, తమిళం, హిందీ, కన్నడ ఇండస్ట్రీలకు చెందిన పలువుర్ స్టార్స్ ముఖ్య పాత్రలలో కనిపించి అలరించారు. మహా భారతాన్ని ఆధారంగా చేసుకుని నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ సినీ ప్రియులను కట్టిపడేసింది. డైరెక్టర్ మేకింగ్, ప్రభాస్ యాక్టింగ్, విజువల్ ఎఫెక్ట్ పై సినీ విశ్లేషకులు ప్రశంసలు కురిపించారు. ఇక ఈ మూవీకి సీక్వెల్ పార్ట్ ఉందన్న సంగతి తెలిసిందే. కల్కి 2 కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే కల్కి 2 గురించి పలుమార్లు హింట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా సెకండ్ పార్ట్ పై నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంకదత్ లు స్పందించారు.

తాజాగా రష్యాలో జరిగిన మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్ లో వీరిద్దరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ కల్కి 2 అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ సీక్వెల్ షూటింగ్ జనవరి, ఫిబ్రవరిలో స్టార్ట్ చేయనున్నట్లు తెలిపారు. చిత్రీకరణ ప్రారంభమైన తర్వాత పార్ట్ 2కు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తామని అన్నారు. అలాగే కల్కి సినిమా విడుదల సమయంలో వచ్చిన ప్రశంసలను ఎప్పటికీ మర్చిపోలేమని ప్రియాంకదత్ అన్నారు.

కల్కి విడుదలైన మొదటివారంలోనే ఎంతో మంది ప్రముఖులు ప్రశంసలు కురిపించారని.. ప్రపంచం నలుమూలల నుంచి అనేక మెసేజ్ లు వచ్చాయని.. వారంతా స్వచ్ఛందంగా సినిమాను ప్రచారం చేశారని.. కల్కి సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఇంకా చేసుకోలేదని.. ప్రస్తుతం వాట్సాప్ లో మాత్రమే వేడుకలు జరుగుతున్నాయని అన్నారు. ఇక కల్కి 2లో కమల్ హాసన్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని గతంలో చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.