‘కల్కి 2898 AD’ సినిమాకి దర్శకత్వం వహించి ఫేమస్ అయిన నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ తీసే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే ఈ పాన్ ఇండియా దర్శకుడు ఇప్పుడు అలియా భట్‌తో ఓ సినిమా చేయనున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓలేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్టులో అలియాను కథానాయికగా తీసుకున్నట్లు తెలిసింది. కల్కి 2 కన్నా ముందే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని ప్రచారం సాగుతోంది. ఇది విన్న అలియా భట్ అభిమానులు చాలా సంతోషించారు. అయితే ఈ వార్తలను డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఖండించాడు. ‘నేను అలియా భట్‌తో సినిమా చేయడం లేదు’ అని కరాఖండిగా చెప్పేశాడు. కాగా ఇప్పుడు నాగ్ అశ్విన్ డిమాండ్ ఎక్కువ. దీనికి కారణం ‘కల్కి 2898 AD’ సినిమా. ఈ సినిమా విశేష ఆదరణ పొందింది. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ వసూళ్ల వర్షం కురిసింది. కల్కి సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. సీక్వెల్‌లో కూడా ఆమె కనిపించనుంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దృష్టంతా కల్కి 2 పైనే ఉంది. ఈ క్రమంలోనే అలియాతో సినిమా చేస్తున్నానన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని నాగ్ క్లారిటీ ఇచ్చాడు.
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న అలియా భట్ తెలుగు సినిమాకి కొత్తేం కాదు. ఇప్పటికే ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలో ఆమె నటించింది. ఇక ఇటీవల లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ ఎక్కువగా యాక్ట్ చేస్తోందీ అందాల తార. గతంలో ‘రాజీ’ సినిమాలో నటించింది. లేటెస్ట్ గా ‘జిగ్రా’ సినిమాలో కూడా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో అలియా భట్ నటనకు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు కూడా అలాంటి పాత్రలోనే నటించేందుకు అలియా సిద్ధమైనట్లు సమాచారం.
ప్రస్తుతం సంజయ్ లీలా బన్సాలీ సినిమాలో అలియా భట్ నటిస్తోంది. ఈ చిత్రానికి ‘లవ్ అండ్ వార్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. మరోవైపు నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌తో బిజీగా ఉన్నాడు. కాబట్టి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చే ఛాన్సుల్లేదు. అయితే భవిష్యత్ లో ఏమైనా జరగొచ్చు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.