Junior Nagarjuna: మనిషిని పోలిన మనుషులను తరచుగా చూస్తూనే ఉంటాం.. అయితే సెలబ్రేటీలు మన దగ్గరే ఉన్నారేమో అనిపించేలా కొంతమంది కనిపిస్తారు. అప్పుడు వేంటనే మన పెద్దవారు చెప్పిన మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారు అన్న మాటలను వెంటనే గుర్తు చేసుకుంటాం. తాజా సోషల్ మీడియాలో ఓ టాలీవుడ్ సీనియర్ హీరోలా ఉన్న వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. ఆ వ్యక్తి కింగ్ నాగార్జునలా కనిపిస్తూ అందరినీ అలరిస్తున్నాడు.
అక్కినేని నాగేశ్వర రావు నట వారసుడిగా వెండి తెరపై నాగార్జున విక్రమ్ సినిమాతో అడుగు పెట్టాడు. నేటికీ కుర్ర హీరోలతో సమానంగా ఉండే ఫిట్ నెట్ తో అమ్మాయిల కలల రాకుమారుడుగా దర్శనమిస్తూనే ఉంటాడు. కింగ్ నాగార్జున టాలీవుడ్ లో తన డ్రెస్సింగ్ స్టైల్ , హెయిర్ స్టైల్ తో సరికొత్త ఒరవడి తీసుకొచ్చాడు. ఈ నవ మన్మధుడిని పోలిన ఓ వ్యక్తికి చెందిన వీడియోలు ఇన్ స్టాగ్రామ్ లో జూనియర్ నాగార్జునగా వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఆ జూనియర్ నాగార్జున వీడియో పై ఓ లుక్ వేయండి..
Also Read: పెను సంక్షోభం దిశగా అమెరికా.. 44 లక్షల మందికి పైగా ఉద్యోగులు రాజీనామా..