Tollywood: ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్ట్.. ఇప్పుడు రూ.4000 కోట్ల బడ్జెట్ సినిమాలో హీరోయిన్

ఈ ఫోటోలోని పాపను గుర్తుపట్టారా..? ఒకప్పుడు చిన్న పాత్రల్లో కనిపించిన ఆ అమ్మాయి… ఈరోజు పాన్ ఇండియా స్థాయిలో టాప్ ప్లేసులో నిలిచింది. తను సినిమాలు చూజ్ చేసుకునే విధానం, సహజమైన నటనత, అభిమానుల హృదయాలను గెలుచుకుంది. క్లూ ఏంటి అంటే ఎక్స్‌పోజింగ్‌కు ఆమడ దూరంలో ఉంటుంది...

Tollywood: ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్ట్.. ఇప్పుడు రూ.4000 కోట్ల బడ్జెట్ సినిమాలో హీరోయిన్
Heroine Childhood Photo

Updated on: Aug 19, 2025 | 4:25 PM

టాలీవుడ్‌లో టాలెంట్ ఉన్న హీరోయిన్లకు వరుస ఆఫర్లు రావడం.. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకోవడం కొత్తేమీ కాదు. కానీ ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్ట్‌గా కనిపించిన అమ్మాయి.. ప్రజెంట్ పాన్-ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు పొందడం మాత్రం అరుదైన విషయం. ఆ అరుదైన విజయాన్ని అందుకున్నది మరెవరో కాదు.. మనందరి ఫేవరెట్ సాయిపల్లవి.

‘ధూమ్ ధామ్’, ‘పల్లవి కస్తూరి మాన్’ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించి, తరువాత డ్యాన్స్ షోలలో తన ప్రతిభను చాటుకున్న సాయిపల్లవి.. ఇప్పుడు 33 ఏళ్ల వయసులోనే బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకమైన రామాయణ్ సినిమాలో సీత పాత్ర పోషిస్తున్నారు. ఏకంగా 4000 కోట్ల రూపాయలతో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌తో, ఆమె పేరు మారుమోగిపోతుంది. సాయిపల్లవి ఇప్పటివరకూ తెలుగు టాప్ స్టార్ హీరోలతో ఎక్కువగా నటించకపోయినా, ఆమెకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ‘ఫిదా’, ‘లవ్ స్టోరీ’ సినిమాలు ఆమె కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చాయి. పాత్రలను జాగ్రత్తగా ఎంచుకోవడం, నేచరల్ యాక్టింగ్.. ఇవన్నీ ఆమెకు మేజర్ ప్లస్ పాయింట్స్.

బాలీవుడ్ రామాయణ్ కోసం సాయిపల్లవి దాదాపు 5 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారని సమాచారం. సీత పాత్రకు ఆమెనే సరైన ఎంపిక అని మేకర్స్ కూడా నమ్ముతున్నారు. అభిమానులు అయితే, భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్, బన్నీలాంటి స్టార్ హీరోల సరసన ఆమెను చూడాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఒక వైపు హై లెవెల్ ప్రాజెక్టులకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న సాయిపల్లవి, మరొక వైపు సినిమా ఆఫర్లు తగ్గితే తిరిగి డాక్టర్‌గా కెరీర్ కొనసాగిస్తానని చెప్పడం గమనార్హం.

2026 దీపావళికి రామాయణ్ మొదటి భాగం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సహజంగా కనిపించే విజువల్ ఎఫెక్ట్స్ కోసం మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.