Ratan Naval Tata: ఎంతో మంది జీవితాలను మార్చిన గొప్ప వ్యక్తి.. రతన్ టాటా మృతికి ఎన్టీఆర్ సహా సినీ ప్రముఖుల సంతాపం

|

Oct 10, 2024 | 9:48 AM

రతన్ టాటా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరూ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.అక్టోబర్ 9న రతన్ టాటా కన్నుమూశారు. ఆయన మరణం ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

Ratan Naval Tata: ఎంతో మంది జీవితాలను మార్చిన గొప్ప వ్యక్తి.. రతన్ టాటా మృతికి ఎన్టీఆర్ సహా సినీ ప్రముఖుల సంతాపం
Ratan Tata Passes Away
Follow us on

సుప్రసిద్ధ వ్యాపారవేత్తగా, అజాతశత్రువుకు శత్రువుగా పేరుగాంచిన రతన్ టాటా మరణం అందరినీ కలిచివేసింది. ఆయన వయసు 86 ఏళ్లు. రతన్ టాటా తన శ్రేయస్సు కంటే సమాజ శ్రేయస్సు కోసమే ఎక్కువగా పనిచేశారు. టాటా సంస్థను నిర్మించి పెంచిన ఆయన ఈరోజు మన మధ్య లేరు. రతన్ టాటా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరూ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.అక్టోబర్ 9న రతన్ టాటా కన్నుమూశారు. ఆయన మరణం ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. “ఇండస్ట్రీ టైటాన్ రతన్ టాటా నిస్వార్థ దాతృత్వం, దూరదృష్టి గల నాయకత్వం లెక్కలేనన్ని జీవితాలను మార్చేశాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను’’ అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

అలాగే కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్..”భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి రతన్ నావల్ టాటాకు హృదయపూర్వక నివాళి’ అని శివన్న ట్వీట్ చేశారు. అలాగే ‘రతన్ టాటా మరణం గురించి వినడం చాలా బాధాకరం’ అని సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. ‘మీ దయతో లక్షలాది మంది జీవితాలను మార్చారు. మీ నాయకత్వ వారసత్వం, దాతృత్వం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. మన దేశానికి మీరు చేసిన సహకారానికి, మీ అసమానమైన అభిరుచి, అంకితభావానికి ధన్యవాదాలు. మీరు మా అందరికీ స్ఫూర్తి. మిమ్మల్ని మిస్ అవుతాం’ అని ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

భారతదేశం నేడు నిజమైన దార్శనికుడిని కోల్పోయింది. అతను సమగ్రత, కరుణ, వ్యక్తిత్వం, వ్యాపారానికి మించినవి. లెక్కలేనన్ని జీవితాలను ప్రభావితం చేశాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని సంజయ్ దత్ అన్నారు. ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయినందుకు ప్రపంచం దుఃఖిస్తుంది. రతన్ టాటా వారసత్వం తరాలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది. భారతదేశనికి చేసిన కృషి ఎనలేనిది. మేము లోతుగా కృతజ్ఞులం. ప్రశాంతంగా ఉండండి సార్ అని అజయ్ దేవగన్ రాసుకొచ్చారు.

ఎన్టీఆర్ ..

సల్మాన్ ఖాన్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.