JR NTR: కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సరే భార్య, పిల్లలతో సరదగా గడుపుతుంటారు జూనియర్. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబానికి సమయం కేటాయిస్తుంటారు. ఇక ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిలది పెద్దలు కుదిర్చిన వివాహమనే విషయం తెలిసిందే. తాజాగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్.. షో సమయంలో తన వివాహానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. పెళ్లి చూపుల సమయంలో లక్ష్మి తనతో అస్సలు మాట్లాడలేదని చెప్పిన ఎన్టీఆర్.. తాను లక్ష్మిని చూడగానే ఓకే చెప్పానని తెలిపారు. అయితే లక్ష్మి మాత్రం తనకు వెంటనే ఎస్ చెప్పలేదని చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో ఎన్టీఆర్ లక్ష్మితో మాట్లాడుతూ.. ‘నేనంటే ఇష్టమేనా లేక బలవంతంగా ఈ పెళ్లిని ఫిక్స్ చేశారా’ అని అడిగాడంటా అయితే దానికి ఆమె అప్పట్లో ఔనని కానీ కాదని కానీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. పెళ్లికి, ఎంగేజ్‌మెంట్‌కు మధ్య 8 నెలల గ్యాప్ వచ్చిన సమయంలోనూ ప్రణతి ఎన్టీఆర్‌కు ఎస్ అని చెప్పలేదంటా.. ఆ సమయంలో ఆడవాళ్లను అర్థం చేసుకోవడం ఎంత కష్టమో అర్థమైందంటూ ఎన్టీఆర్ తెలిపారు.
అంతేకాకుండా.. ‘ఆడవాళ్లను అర్ధం చేసుకున్నవాడు ప్రపంచంలో దేన్నైనా అర్ధం చేసుకుంటాడనే విషయం నాకు ఆ తర్వాత అర్థమైంది’ అంటూ ఫన్నీ కామెంట్ చేశారు ఎన్టీఆర్. ఇక కెరీర్ విషయానికొస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తికాగానే కొరటాల శివ, ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాలో నటించనున్నారు.
Also Read: Bheemla Nayak : భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పై వివాదం.. అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ పోలీసులు
Pawan Kalyan: వెల్లువెత్తిన శుభాకాంక్షలు.. అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్..
విరబూసిన ఎర్రని మందారంలా.. అందాల సోయగం శ్రియా సరన్.: Shriya Saran Photos.