NTR: ఆస్కార్‌ వేదికపై డ్యాన్స్‌ చేయకపోవడానికి రీజన్ అదే: ఎన్టీ రామారావు

|

Mar 10, 2023 | 8:37 PM

ఆస్కార్‌ అవార్డుల కోసం యావత్‌ ప్రపంచం వేచి చూస్తోంది. కానీ మన భారతీయులు మాత్రం ఆ వేదికపై ఇద్దరు తెలుగు హీరోల అడుగుల చప్పుడుని వినేందుకు ఊపిరిబిగబట్టకుని ఉన్నారు. ఆ క్షణాల కోసం ఎదురుచూస్తోన్న అశేష ప్రజానీకాన్ని జూనియర్‌ ఎన్టీఆర్‌ లేటెస్ట్‌ స్టేట్‌మెంట్‌ ఆందోళనకు గురిచేస్తోంది. అదేంటో చూద్దాం...

NTR: ఆస్కార్‌ వేదికపై డ్యాన్స్‌ చేయకపోవడానికి రీజన్ అదే: ఎన్టీ రామారావు
Actor Nt Ramarao
Follow us on

ఒక్క భారత్‌ కాదు… యావత్‌ ప్రపంచం హృదయ స్పందన ఇప్పుడు ఆస్కార్‌ వేదికపై ప్రకటించే అపురూపమైన అవార్డులపైనే…అయితే భారతీయులందరి దృష్టీ మాత్రం ప్రపంచ ప్రజలను ఉర్రూతలూగించిన నాటు నాటు పాటకి ఆ ఇద్దరి అడుగుల చప్పుడుపైనే ఉంది.

ఆస్కార్‌ వేదికపై నాటు నాటు పాటను ప్రదర్శించే అరుదైన అవకాశం మనవారికి దక్కింది. ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందం అమెరికాలో సందడి చేస్తోంది. ఎన్టీఆర్‌ వరుస ఇంటర్వ్యూలతో విదేశీ మీడియాని ఎట్రాక్ట్‌ చేస్తున్నారు. అభిమాన హీరోలు ఆస్కార్‌ వేడుకలో రెడ్‌ కార్పెట్‌పై నడిచే రోజు కోసం సినీప్రియులంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఇంటర్నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీం రెడ్‌ కార్పెట్‌పై నడవడం గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

జూనియర్‌ ఎన్టీఆర్‌…రామ్‌చరణ్‌ డాన్స్‌కోసం అంతా ఎదురుచూస్తున్న వేళ… “ఆ ఆస్కార్‌ వేదికపై ‘నాటు నాటు’ పాటను లైవ్‌లో చూడాలని ఆసక్తిగా ఉన్నాను. మేము ఆ పాటకు డ్యాన్స్‌ వేస్తామని కచ్చితంగా చెప్పలేను. నాకు, రామ్‌ చరణ్‌కు రిహార్సల్స్‌ చేసే సమయం లేదు. అందుకే మేము ఆస్కార్‌ వేదికపై డ్యాన్స్‌ చేయలేకపోతున్నాం. ఆ పాటను ఎప్పుడు విన్నా నా కాళ్లు డాన్స్‌ చేస్తూనే ఉంటాయి’’ అంటూ ఎన్టీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందర్నీ సందిగ్ధంలోకి నెట్టాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..