స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గత అర్ధరాత్రి ఓ దొంగ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈఘటనలో హీరో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సైఫ్ ఇంటికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడి అనంతరం పారిపోయిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. మరోవైపు లీలావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సైఫ్ వాంగ్మూలం కోసం పోలీసులు వెయిట్ చేస్తున్నారు.
సైఫ్ పై జరిగిన దాడి ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. “సైఫ్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు సైఫ్ పై జరిగిన దాడిపై బాలీవుడ్ సినీప్రముఖులు ఆరా తీస్తున్నారు. ఇప్పుటికే ఎంపీ సుప్రియా సూలే సైఫ్ అలీఖాన్ కుటుంబం గురించి ఆరా తీసింది. సైఫ్ భార్య కరినా కపూర్ కు కాల్ చేసి వివరాలు తెలుసుకుంది. ఉదయం 3 గంటల 30 నిమిషాలకు సైఫ్ ను ఆసుపత్రికి తీసుకువచ్చారని.. అతడి శరీరంలో ఆరు చోట్ల గాయాలు అయ్యాయని.. రెండు చోట్ల లోతుగా గాయాలు అయ్యాయని తెలుస్తోంది. పూర్తి చికిత్స తర్వాత సైఫ్ ఆరోగ్యం గురించి పూర్తిగా చెప్పగలమని వైద్యులు అన్నారు.
సైఫ్ అలీఖాన్, ఎన్టీఆర్ కలిసి దేవర చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈచిత్రం గతేడాది థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. విలన్ పాత్రలో కనిపించాడు సైఫ్. అంతకుముందు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో రావణుడి పాత్రలో నటించాడు సైఫ్.
Shocked and saddened to hear about the attack on Saif sir.
Wishing and praying for his speedy recovery and good health.
— Jr NTR (@tarak9999) January 16, 2025
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..