NTR : అభయ్, భార్గవ్ సినీ ఎంట్రీపై తారక్ ఆసక్తికర కామెంట్స్.. తండ్రి బాటలోనే అంటూ..

|

Oct 07, 2024 | 7:15 AM

మన టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. అలాగే అక్కినేని, ఘట్టమనేని , దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి కూడా ఎంతో మంది వచ్చారు. అలాగే నందమూరి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. నందమూరి తారకరామారావు దగ్గర నుంచి ఎంతో మంది గొప్ప నటులు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. వీరిలో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఓ ప్రభంజనమే అని చెప్పాలి.

NTR : అభయ్, భార్గవ్ సినీ ఎంట్రీపై తారక్ ఆసక్తికర కామెంట్స్.. తండ్రి బాటలోనే అంటూ..
Jr Ntr
Follow us on

సినిమా ఇండస్ట్రీలో నటవారసులు చాలామందే వచ్చారు. సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వారు తమను తాము నిరూపించుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తూ స్టార్స్ గా ఎదిగారు. ఇప్పటికే మన టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. అలాగే అక్కినేని, ఘట్టమనేని , దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి కూడా ఎంతో మంది వచ్చారు. అలాగే నందమూరి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. నందమూరి తారకరామారావు దగ్గర నుంచి ఎంతో మంది గొప్ప నటులు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. వీరిలో జూనియర్ ఎన్టీఆర్ అయితే ఓ ప్రభంజనమే అని చెప్పాలి. ఎన్టీఆర్ క్రేజ్ గురించి. ఆయన ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

టాలీవుడ్ స్టార్ యాక్టర్ గానే కాదు పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తున్నాడు ఎన్టీఆర్ . యంగ్ టైగర్ నుంచి ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారిపోయాడు తారక్. తారక్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది. దాంతో ఎన్టీఆర్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇక రీసెంట్ గా దేవర సినిమాతో మరో సంచలనం క్రియేట్ చేశాడు తారక్. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించి మెప్పించాడు. అలాగే దేవర సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవర సినిమా విజయం సాధించడంతో తరాజ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అలాగే మూవీ టీమ్ కూడా సినిమాను మరింతగా ప్రమోట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ దేవర సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కొడుకులు అభయ్, భార్గవ్ రామ్ కు సంబందించిన ప్రశ్న ఎదురైంది. అభయ్, భార్గవ్ సినిమాల్లోకి వస్తారా అని అడిగిన ప్రశ్నకు తారక్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.  నా అభిప్రాయాలను వాళ్ళమీద రుద్దడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో ఆ వాతావరణం మనం కల్పించాలి. యాక్టింగ్ లో రాణించాలని, సినిమాల్లోకి రావాలని నేను వాళ్ళను బలవంతం చేయను. ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను అలా ట్రీట్ చేయలేదు. నేను కూడా నా పిల్లలు ఏం సాదించాలనుకుంటారో చేయని అని అనుకుంటా..నా వృత్తి గురించి నా పిల్లకు తెలుసు, తండ్రి నటుడు అయితే పిల్లలు కూడా అదే బాటలో అడుగులు వేయాలనుకుంటారు అది సహజం అని ఎన్టీఆర్ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.