NTR : వార్ 2 షూటింగ్ నుంచి ఎన్టీఆర్ ఫోటోలు లీక్.. నిరాశ వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమా దేవర. దేవర సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు. రాజమౌళి సినిమా తర్వాత ఎక్కడ ఫ్లాప్ పడుతుందో అని అభిమానులు ఆందోళన పడ్డారు. కానీ దేవర సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.

NTR : వార్ 2 షూటింగ్ నుంచి ఎన్టీఆర్ ఫోటోలు లీక్.. నిరాశ వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్
Ntr

Updated on: Feb 12, 2025 | 11:39 AM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా మొదటి భాగం ఇప్పటికే విడుదలై భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత విడుదలైన దేవర సినిమా ఆ భారీ హిట్ అవ్వడంతో తారక్ అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. ఇక ఇప్పుడు తారక్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు. దేవర తర్వాత బాలీవుడ్ మూవీ ఈ వార్ 2లో నటిస్తున్నాడు. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ హీరోగా నటించిన వార్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో హృతిక్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

కాగా ఈ మూవీ నుంచి తాజాగా కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. వార్ 2 సినిమా షూటింగ్ ముంబైలో జెట్ స్పీడ్ తో జరుగుతుంది. తారక్ పై యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. అయితే  ఈ యాక్షన్ సీన్స్ కు సంబందించిన కొన్ని ఫోటోలు నెట్టింట దర్శనమిచ్చాయి. దాంతో చిత్రయూనిట్ షాక్ అయ్యింది. ఎంతో పగడ్బందీగా చేస్తున్న షూటింగ్ నుంచి ఫోటోలు లీక్ అవ్వడం ఇప్పుడు చిత్ర యూనిట్ ను టెన్షన్ పెడుతుంది.

ఇవి కూడా చదవండి

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయని తెలుస్తుంది. యాక్షన్ సీన్స్ తో పాటు భారీ ఛేజింగ్ సీన్స్  కూడా ఆకట్టుకుంటాయి అని అంటున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం  వహిస్తున్నారు. ఇక వార్ 2 నుంచి లీక్ అయిన ఫోటోల పై తారక్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. చిత్రయూనిట్ జాగ్రత్తగా ఉండాలని మూవీ టీమ్ ను హెచ్చరిస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఇక వార్ 2 తర్వాత తారక్ దేవర 2తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.