యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం యావత్ దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డ్స్ సునామి సృష్టిస్తోంది. భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు జక్కన్న.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఇందులో భీమ్ పాత్ర కోసం ఎన్టీఆర్ పడిన కష్టాన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు జక్కన్న. ఎన్టీఆర్ యక్షన్ సన్నివేశాలు.. భీమ్ మేకోవర్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో చూస్తుంటే భీమ్ పాత్ర కోసం ఎన్టీఆర్ ఎంతగా కష్టపడ్డారనేది స్పష్టంగా అర్థమవుతుంది. బైక్ డ్రైవింగ్, అడవిలో పరిగెత్తే సన్నివేశాలను చూపించడమే కాకుండా.. కెమెరా వెనక మాస్క్ పెట్టుకుని ఎన్టీఆర్ ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలను ఈ వీడియోలో చూపించారు. ఆర్ఆర్ఆర్ కోసం అటు జక్కన్న.. ఇటు భీమ్ పాత్ర కోసం తారక్ ఎంతగా కష్టపడ్డారో ఈ వీడియో చూస్తేనే తెలుస్తోంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. హాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, శ్రియ కీలక పాత్రలలో నటిస్తున్నాడు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తారక్ భీమ్ మేకోవర్ వీడియోను మీరు చేసేయ్యండి.
వీడియో.
Samantha: ఇలా కనిపించాలంటే మాత్రం హార్డ్‌వర్క్ కంపల్సరీ.. మరోసారి హాట్ కామెంట్స్ చేసిన సమంత..