Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న ఆ ఒకే ఒక్క వ్యక్తి ఎవరో తెలుసా..?

|

Jul 30, 2022 | 3:21 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అపారమైన ఫ్యాన్ బేసే ఉంది. సోషల్ మీడియాలో కూడా మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ట్విట్టర్‌లో ఒకే ఒక వ్యక్తి ఫాలో అవుతున్నారు తారక్. అతనెవరో మీకు తెలుసా..?

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న ఆ ఒకే ఒక్క వ్యక్తి ఎవరో తెలుసా..?
Ntr Twitter
Follow us on

Tollywood: యంగ్ టైగర్ ఎన్టీఆర్… ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నట రాక్షసుడు. కెమెరా స్విచ్చాన్ చేస్తే చాలు.. పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. హీరోయిజం ఎలివేట్ చేసే సీన్ అయినా.. విలనిజం చాయలున్న పాత్రైనా.. కామెడీ టైమింగ్‌కు సంబంధించిన సన్నివేశం అయినా సరే చిన్న రామారావు చెలరేగిపోతాడు. ఇక డ్యాన్స్, ఫైట్స్ గురించి చెప్పేది ఏముంటుంది చెప్పండి. తారక్‌కు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక అభిమానులకు అంతే ప్రేమను పంచుతాడు ఎన్టీఆర్. ప్రతి ఆడియో లేదా ప్రి రిలీజ్ ఫంక్షన్‌కు వచ్చిన అభిమానులను క్షేమంగా ఇళ్లకు వెళ్లాలని కోరతాడు. ఫ్యాన్స్ ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి అండగా ఉంటాడు. వారిని కలవడం లేదా ఫోన్లో మాట్లాడటం వంటివి చేస్తుంటాడు. నందమూరి(Nandamuri) లెగసీని ముందుకు తీసుకెళ్తున్న తారక్‌ను.. కులాలు, మతాలకు అతీతంగా ఫాలో అయ్యేవారు ఉంటారు. తారక్ సినిమా వస్తుందంటే ఫ్యాన్స్‌కు పూనకాలే. ఇక సోషల్ మీడియాలో‌ కూడా తారక్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ట్విట్టర్‌(NTR Twitter)లో ఎన్టీఆర్‌ను 6.1 మిలియన్ యూజర్స్ ఫాలో అవుతున్నారు. వెరీ రేర్‌గా తారక్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌లు వేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫాలో అయ్యేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అయితే తనను అంత మందిని ఫాలో అవుతున్నప్పటికీ.. తారక్ మాత్రం ఒక్కరినే ఫాలో అవుతున్నారు. ఆయనెవరో మీరు గెస్ చేయగలరా..?. క్లూ ఏంటంటే.. తారక్‌తో ఎక్కువగా సినిమాలు తీసిన దర్శకుడు ఆయన. ఇంక అర్థమైపోయే ఉంటుంది. ఈ హీజ్ నన్ అదర్‌దెన్ జక్కన్న రాజమౌళి.

వీరిద్దరి కాంబినేషన్‌లో స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ, ఆర్.ఆర్.ఆర్ సినిమాలు వచ్చాయి. అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. తన ఫేవరెట్ యాక్టర్ ఎన్టీఆర్ అని రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పారు. తారక్‌ కూడా రాజమౌళి అంటే అంతే అభిమానం ప్రదర్శిస్తారు. వీరిద్దరి కాంబినేషన్‌లో మరిన్ని సూపర్ హిట్ సినిమాలు రావాలని ఆశిద్దాం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి