క్యాన్సర్‌ రోగుల రోగం జూనియర్‌ ఎన్టీఆర్‌ వీరాభిమాని సాహసం.. 50 ఏళ్ల వయసులో అనారోగ్యాన్ని లెక్కచేయకుండా..

ఫ్యాన్స్‌ అంటే అభిమాన హీరోల పోస్టర్లు, కటౌట్లకు పూలదండలు వేయడం, పాలాభిషేకాలు చేయడమే కాదు .. కష్టాల్లో ఉన్నవారికి కూడా తమ చేతైనన సహాయం చేయడం, వారి కన్నీళ్లు తుడవడం.. ఇదే విషయాన్ని ఫాలో అవుతున్నారు అమెరికాలో ఉంటోన్న జనార్ధన్‌.

క్యాన్సర్‌ రోగుల రోగం జూనియర్‌ ఎన్టీఆర్‌ వీరాభిమాని సాహసం.. 50 ఏళ్ల వయసులో అనారోగ్యాన్ని లెక్కచేయకుండా..
Jrntr Fan

Updated on: Jan 06, 2023 | 9:50 AM

ఫ్యాన్స్‌ అంటే అభిమాన హీరోల పోస్టర్లు, కటౌట్లకు పూలదండలు వేయడం, పాలాభిషేకాలు చేయడమే కాదు .. కష్టాల్లో ఉన్నవారికి కూడా తమ చేతైనన సహాయం చేయడం, వారి కన్నీళ్లు తుడవడం.. ఇదే విషయాన్ని ఫాలో అవుతున్నారు అమెరికాలో ఉంటోన్న జనార్ధన్‌. 50 ఏళ్ల వయసున్న ఆయన జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు నందమూరి కుటుంబానికి వీరాభిమాని. తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆయన షోల్డర్ ఆర్థరైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నారు. అయితే తన అనారోగ్యాన్ని ఏ మాత్రం లెక్కచేయకుండా క్యాన్సర్ రోగుల కోసం ఆఫ్రికాలోని టాంజానియాలో ఉన్నఅత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారాయన. మైనస్‌ డిగ్రీల్లో ఉష్ణోగ్రత, 30 శాతం ఆక్సిజన్‌ ఉన్నప్పటికీ క్యాన్సర్‌ బాధితులకు నిధుల సేకరణ లక్ష్యంగా పర్వతాన్ని ఎక్కి ఎంతో సాహసానికి పూనుకున్నారు. సుమారు 7 రోజుల పాటు ఈ సాహసయాత్ర కొనసాగింది.

కాగా తానా, బసవతారకం సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ ని నిర్వహించినట్లు జనార్ధన్‌ తెలిపారు. దీనికి మంచి స్పందన వచ్చందని ఇప్పటివరకు కోటి రూపాయల దాకా ఫండ్స్‌ వచ్చాయంటున్నారు. ఈ డబ్బుతో క్యాన్సర్ రోగుల చికిత్సకు కావాల్సిన అధునాతన పరికరాలు కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ‘రెండేళ్లలో మరో ప్రాజెక్ట్ కు రెడీ అవుతున్నాం. ఈసారిలా ఒకే హాస్పిటల్ కి కాకుండా వివిధ హాస్పిటల్స్ కి ఫండ్స్ రైజ్ చేద్దామని అనుకుంటున్నాం. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్న చిన్న పిల్లలకి హార్ట్ సర్జరీలు చేయించాలని భావిస్తున్నాం. 2024 డిసెంబర్ కల్లా సుమారు రూ. 2 కోట్లు సేకరించి పిల్లలకు హార్డ్‌ సర్జరీలు చేసే ప్లాన్‌లో ఉన్నాం. ఇక తెలంగాణలో చేసినట్టే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సేవా కార్యక్రమాలు ప్రారంభించాలనుకుంటున్నాం’ అని జనార్ధన్‌ తెలిపారు. కాగా క్యాన్సర్‌ రోగుల కోసం ఎంతో రిస్క్‌ చేసిన ఆయనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేసేలా ఆయన్ని భగవంతుడు ఆశీర్వదించాలంటూ కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..