‘దేవర’ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టి్స్తోన్న సినిమా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా ఇది. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలు పోషించగా.. అనిరుధ్ రవిచంద్రన్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో ద్విపాత్రాభినయంలో తారక్ మరోసారి నట విశ్వరూపం చూపించాడు. ఇక జాన్వీ స్పెషల్ అట్రాక్షన్ కాగా.. అనిరుధ్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలెట్ అయ్యింది. విడుదలైన ఫస్ట్ డే నుంచి ఈ సినిమాకు ఓ రేంజ్ రెస్పాన్స్ రాగా.. అటు థియేటర్లలో కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది ఈ సినిమా. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు పది రోజుల్లోనూ వసూళ్ల సునామి సృష్టిస్తుంది.
దేవర మూవీ విడుదలై పది రోజులు అవుతున్నప్పటికీ కలెక్షన్స్ లో తగ్గేదేలే అంటోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ అవుతుంది. కేవలం పది రోజుల్లోనే రూ.466 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని ఓ కొత్త పోస్టర్ ద్వారా చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక దసరా పండగకు ముందు బాక్సాఫీస్ వద్ద హావా చూపిస్తున్న దేవర.. ఇటు పండగ నాటికి రూ.500 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టడం ఖాయంగా తెలుస్తోంది. ప్రస్తుతం దసరా సెలవులు కొనసాగుతుండడం.. ఇటు పండక్కి మరో భారీ బడ్జెట్ మూవీ లేకపోవడం కూడా దేవరకు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది.
దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లలు సత్తా చాటుతున్న దేవర ఫస్ట్ పార్ట్. మరికొన్ని రోజుల్లోనే సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. పార్ట్ 2 ఇంకా బాగుంటుందని.. ఇప్పటికే మేజర్ సీన్ షాట్స్ కూడా పూర్తైందన్నారు ఎన్టీఆర్.
When the sea gets wild…..
nothing can stop a force like #Devara 🔥#BlockbusterDevara pic.twitter.com/18Q4wxLbXr— Devara (@DevaraMovie) October 7, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.