AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yatra 2: వైఎస్ జగన్‌ పాత్ర కోసం జీవా ఎంత కష్టపడ్డాడో చూశారా? ‘యాత్ర 2’ మేకింగ్‌ వీడియో

ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదలైన యాత్ర 2 డీసెంట్‌ టాక్‌ తో దూసుకెళుతోంది. బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఏపీ రాజకీయాల ఇతివృత్తంపై సినిమా ఉన్నప్పటికీ సగటు సినీ ప్రేక్షకులు కూడా యాత్ర 2 సినిమాను చూసేందుకు వెళుతున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఇక జగన్‌ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా జీవించాడని ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు

Yatra 2: వైఎస్ జగన్‌ పాత్ర కోసం జీవా ఎంత కష్టపడ్డాడో చూశారా? 'యాత్ర 2' మేకింగ్‌ వీడియో
Yatra 2 Making Visuals
Basha Shek
|

Updated on: Feb 11, 2024 | 3:59 PM

Share

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి, ఆయన తనయుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి జీవితాల్లోని కీలక ఘట్టాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన చిత్రం యాత్ర 2. సుమారు ఐదేళ్ల క్రితం 2019లో రిలీజైన యాత్రకు ఇది సీక్వెల్‌. మొదటి పార్ట్‌నే తెరకెక్కించిన డైరెక్టర్‌ మహి. వి. రాఘవ్‌ యాత్ర2 ను రూపొందించాడు. వైఎస్సార్ పాత్రలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి నటించగా, వైఎస్‌ జగన్‌ పాత్రలో జీవా జీవించి పోయాడు. ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదలైన యాత్ర 2 డీసెంట్‌ టాక్‌ తో దూసుకెళుతోంది. బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఏపీ రాజకీయాల ఇతివృత్తంపై సినిమా ఉన్నప్పటికీ సగటు సినీ ప్రేక్షకులు కూడా యాత్ర 2 సినిమాను చూసేందుకు వెళుతున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఇక జగన్‌ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా జీవించాడని ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లలో దూసుకెళుతోన్న యాత్ర 2 సినిమా గురించి వరుసగా సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు మేకర్స్‌. ఇటీవలే ఇందులోని డిలీటెడ్ సీన్‌ను సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేశారు. తాజాగా మేకింగ్ అఫ్ యాత్ర 2 పేరుతో స్పెషల్‌‌ వీడియోను విడుదల చేశారు మూవీ టీమ్.

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా ఈ మేకింగ్ వీడియో వైరల్‌ గా మారింది. ఇందులో వైఎస్‌ జ‌గ‌న్ పాత్ర‌లో జీవాని ఎంపిక చేయ‌డం ద‌గ్గ‌ర‌ నుంచి షూటింగ్ ముగింపు వ‌ర‌కు యాత్ర 2 ను సక్సెస్‌ ఫుల్‌ గా తెరకెక్కించడంలో టీమ్‌ చేసిన కష్టం కనిపిస్తుంది. అలాగే మూవీలో హైలెట్‌గా నిలిచిన పలు సన్నివేశాలను ఎలా చిత్రీకరించారో ఈ వీడియోలో చూపించారు. ఇక వైఎస్‌ జగన్‌ గా కనిపించేందుకు జీవా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు? ఎలా కష్టపడ్డాడో తదితర విషయాలను ఇందులో వివరించాడు. అలాగే యాత్ర 2 సినిమా షూటింగ్‌ లో తనకెదురైన మరిన్ని అనుభవాలను ఇందులో షేర్‌ చేసుకున్నాడు. మరి ఆ ముచ్చట్లేంటో మీరూ చూసేయండి.

ఇవి కూడా చదవండి

యాత్ర 2 బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత