Jayam Ravi: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్! ఇన్ స్టా గ్రామ్ ఖాతాల నుంచి ఫొటోలు డిలీట్

|

Jun 25, 2024 | 9:13 PM

ఇప్పటికే ధనుష్-ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు. ఇటీవలే ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్.. తన భార్యతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. అంతలోనే మరో స్టార్ కపుల్ కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆ జంట మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి, ఆయన సతీమణి ఆరతి.

Jayam Ravi: విడాకుల బాటలో మరో స్టార్ కపుల్! ఇన్ స్టా గ్రామ్ ఖాతాల నుంచి ఫొటోలు డిలీట్
Jayam Ravi Family
Follow us on

సినిమా ఇండస్ట్రీలో మరో స్టార్ కపుల్ విడిపోనున్నారా? విడాకులు తీసుకునేందుకు రెడీగా ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా కోలీవుడ్ లో ఈ విడాకుల వ్యవహారాలు ఎక్కువగా నడుస్తున్నాయి. ఇప్పటికే ధనుష్-ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు. ఇటీవలే ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్.. తన భార్యతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. అంతలోనే మరో స్టార్ కపుల్ కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆ జంట మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి, ఆయన సతీమణి ఆరతి. తాజాగా ఈ భార్యా భర్తలిద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి ఫొటోలు తీసేయడం విడాకుల రూమర్లకు కారణమైంది. ప్రముఖ ఎడిటర్ మోహన్ కొడుకే జయం రవి. తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఆ మధ్యన పొన్నియన్ సెల్వన్ వంటి పాన్ ఇండియా మూవీలోనూ మెరిశాడు. జయం రవి 2009లో ఆరతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారుడు ఉన్నారు.

జయం రవి- ఆరతి దంపతులు ఎప్పటి నుంచో విడాకులు తీసుకోబోతున్నారటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. కొంత మంది ఈ పుకార్లను కొట్టి పారేశారు. అయితే తాజాగా రవి తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా నుంచి భార్య ఫొటోలు, ఫ్యామిలీ ఫొటోలు తీసేయడంతో విడాకుల వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. ఆరతి కూడా తన సోషల్ మీడయా ఖాతాలో నుంచి కొన్ని ఫోటోలను తొలగించింది. దీంతో ఈ ఇద్దరు డివోర్స్ తీసుకోబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇద్దరి మధ్య విభేదాల ఉన్నాయని, గత కొన్నేళ్ల నుంచే జయం రవి, ఆరతి విడగా ఉంటున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. సమస్యను పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయని సమాచారం. దీంతో త్వరలో ఈ ఇద్దరు విడాకులు తీసుకోవడం కన్ఫమ్ అంటోంది కోలీవుడ్ మీడియా. మరి ఈ విడాకుల వార్తలు నిజమో, అబద్ధమో తెలియాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాలి. అప్పుడే అసలు విషయం బయటపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఆర్తి రవి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

 

జయం రవి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.