
తన నటనతో , డాన్స్ తో ప్రపంచాన్నే ఊపేశాడు నందమూరి చిన్నోడు, అభిమానుల మ్యాన్ ఆహ్ మాసెస్ ఎన్టీఆర్. నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఎన్టీఆర్ ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ కు పూనకాలే.. నటనలో తాత నందమూరి తారకరామారావు దగ్గర ఓనమాలు దిద్ది.. డాన్స్ లో మైకేల్ జాక్సన్ ను మరిపించేలా మెప్పించి.. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తారక్ ప్రపంచామంతట అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎన్టీఆర్ అంటే ఒక పేరు కాదు ఒక బ్రాండ్. కేవలం ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ ఎన్టీఆర్ కు వీరాభిమానులున్నారు. ముఖ్యంగా జపాన్ లో ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కు దేశ విదేశాల్లో ఫ్యాన్స్ పెరిగిపోయారు. ముఖ్యంగా జపాన్ లో తారక్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ రిలీజ్ సమయంలో తారక్ అక్కడ పర్యటించారు. అలాగే ఇటీవల దేవర సినిమాను కూడా జపాన్ లో రిలీజ్ చేశారు. తారక్ కు జపాన్ లో లేడీ ఫ్యాన్స్ ఎక్కువ. ఓ జపాన్ యువతి తారక్ సినిమాలు చూసి తెలుగు కూడా నేర్చుకుంది.
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. జపాన్ లోకల్ ట్రైన్ లో ఓ వ్యక్తి బ్యాగ్ కు జూనియర్ ఎన్టీఆర్ లాకెట్ తో కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎక్కడో ఉన్న జపాన్ లోకల్ ట్రైన్ లో తారక్ లాకెట్ ఉందంటే ఆయన క్రేజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు అంటున్నారు ఫ్యాన్స్. తారక్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వార్ 2లో నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదలకానుంది. అలాగే దేవర 2లోనూ నటిస్తున్నాడు ఎన్టీఆర్. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి