Jailer Song : జపాన్‌లోనూ అదే ఊపు.. తమన్నా పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన అమ్మాయిలు
జైలర్ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది, ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించాడు. కమల్ హాసన్ కు విక్రమ్ ఎంత పెద్ద హిట్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు సూపర్ స్టార్ కు జైలర్ అంత పెద్ద విజయం సాధించి పెట్టింది. నెల్సన్ గత చిత్రం బీస్ట్ దెబ్బ కొట్టడంతో ఈ సినిమా మీద గట్టిగానే ఫోకస్ పెట్టి సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలో రజినీకాంత్ నటన, ఆయన ఎనర్జీ ప్రేక్షకులను కట్టిపడేసింది. జైలర్ సినిమా విదులైన అన్ని ఏరియాల నుంచి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజే దాదాపు 90 కోట్ల వరకు వసూల్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.

రీసెంట్ డేస్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో జైలర్ మూవీ ఒకటి ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సూపర్ స్టార్ సాలిడ్ హిట్ కొట్టాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్న అభిమానుల కోరిక తీర్చింది జైలర్. ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది, జైలర్ సినిమాకు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించాడు. కమల్ హాసన్ కు విక్రమ్ ఎంత పెద్ద హిట్ తెచ్చిపెట్టింది.. ఇప్పుడు సూపర్ స్టార్ కు జైలర్ అంత పెద్ద విజయం సాధించి పెట్టింది. నెల్సన్ గత చిత్రం బీస్ట్ దెబ్బ కొట్టడంతో ఈ సినిమా మీద గట్టిగానే ఫోకస్ పెట్టి సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలో రజినీకాంత్ నటన, ఆయన ఎనర్జీ ప్రేక్షకులను కట్టిపడేసింది. జైలర్ సినిమా విదులైన అన్ని ఏరియాల నుంచి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజే దాదాపు 90 కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదటి రోజు 10 కోట్ల వరకు వసూల్ చేసింది.
ప్రస్తుతం ఈ మూవీ 350 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ రజినీకాంత్ కు జోడీగా నటించారు. అలాగే తమన్నా ఓ కీలక పాత్రలో మెరిసింది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మహన్ లాల్ , టాలీవుడ్ నుంచి సునీల్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు.
ఇక ఈ మూవీలో తమన్నా ”నువ్ కావాలయ్యా” అనే పాటలో స్టెప్పులేసింది. ఈ పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే పాట మారుమ్రోగిపోతుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇదే వీడియో దర్శనమిస్తుంది. చాల మంది ఈ వీడియోకు రీల్స్ చేసి తమ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఇద్దరు జపాన్ కు చెందిన యువతులు ఈ పాట హుక్ స్టెప్ ను వేసి అందరిని ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
There is no stopping the #Kaavaalaa fever! 💃💥 Vibes from #Tokyo #Japan 🏯🎌 Truly a pan-world hit 🌍❤️🔥#JailerFromAug10th #Jailer #Rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @tamannaahspeaks @shilparao11 @sunpictures pic.twitter.com/Lnzc2M1frk
— Ajas (@AjasOnline) July 26, 2023
తమన్నా తన సోషల్ మీడియాలో కూడా తన డాన్స్ వీడియోను షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..