Jailer Movie: ‘కావాలా ‘పాటకు జపానీయుల డాన్స్.. ఎంతందంగా చేశారో చూశారా ?..

|

Aug 18, 2023 | 2:11 AM

సినిమాల్లోని ప్రత్యేక పాటలు కొన్నిసార్లు విపరీతమైన దృష్టిని ఆకర్షిస్తాయి. గతంలో విడుదలైన ‘పుష్ప’ సినిమాలోని ‘ఊ అంటావా మావా..’ పాట సూపర్ హిట్ అయింది. ఈ పాట శబ్దం ప్రతిచోటా వినిపించింది. ఇప్పుడు 'కావాలా..' పాట వంతు వచ్చింది. ఈ పాటకు మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ పాటకు ఓ జపాన్ వ్యక్తి స్టెప్పులేశాడు. ఈ పాట జపాన్‌లో కూడా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు జపాన్‌లో భారత రాయబారి హిరోషి సుజుకీ ‘కావాలా..’ పాటకు స్టెప్పులేశారు.

Jailer Movie: కావాలా పాటకు జపానీయుల డాన్స్.. ఎంతందంగా చేశారో చూశారా ?..
Kaavaalaa Song
Follow us on

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జైలర్ మేనియా కొనసాగుతుంది. ఈ సినిమా ఆరు రోజుల్లోనే 400 కోట్లు రాబట్టింది. ఈ సినిమాలోని ‘కావాలా..’ పాట కూడా సూపర్ హిట్ అయింది. ఈ పాట యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. తమన్నా వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ పాటకు చిన్న, పెద్దా అనే తేడా లేకుండా డ్యాన్స్ చేస్తున్నారు. ఈ పాటకు కేవలం భారతీయులే కాదు.. విదేశీయులు స్టెప్పులేస్తున్నారు. జపాన్‌లోని భారత రాయబారి కూడా ఈ పాటకు స్టెప్పులేసి అందరి దృష్టిని ఆకర్షించారు. సినిమాల్లోని ప్రత్యేక పాటలు కొన్నిసార్లు విపరీతమైన దృష్టిని ఆకర్షిస్తాయి. గతంలో విడుదలైన ‘పుష్ప’ సినిమాలోని ‘ఊ అంటావా మావా..’ పాట సూపర్ హిట్ అయింది. ఈ పాట శబ్దం ప్రతిచోటా వినిపించింది.

ఇప్పుడు ‘కావాలా..’ పాట వంతు వచ్చింది. ఈ పాటకు మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ పాటకు ఓ జపాన్ వ్యక్తి స్టెప్పులేశాడు. ఈ పాట జపాన్‌లో కూడా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు జపాన్‌లో భారత రాయబారి హిరోషి సుజుకీ ‘కావాలా..’ పాటకు స్టెప్పులేశారు.

జపానీయుల డాన్స్..

హిరోషి జపనీస్ యూట్యూబర్ మైయో శాన్‌తో కలిసి పనిచేశారు. జపనీస్ యూట్యూబర్ మైయో సాన్‌తో కావాలా పాటకు డాన్స్. రజనీకాంత్‌పై నా ప్రేమ స్థిరమైనది’ అని రాశారు.

తమన్నా ఇన్ స్టా పోస్ట్..

‘జైలర్’ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు కన్నడ శివరాజ్‌కుమార్‌, మలయాళ ఆర్టిస్టులు మోహన్‌లాల్‌, వినాయకన్‌లు నటించారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది.

తమన్నా ఇన్ స్టా పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.