Jailer: సూపర్ స్టారా మజాకా..రజినీకాంత్ జైలర్ మూవీ గ్లిమ్ప్స్ నెక్స్ట్ లెవల్ అంతే..

|

Dec 13, 2022 | 6:43 AM

ప్రస్తుతం రజినీకాంత్ నెల్సన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇటీవలే దళపతి విజయ్ తో బీస్ట్ సినిమా చేశారు నెల్సన్ దిలీప్.

Jailer: సూపర్ స్టారా మజాకా..రజినీకాంత్ జైలర్ మూవీ గ్లిమ్ప్స్ నెక్స్ట్ లెవల్ అంతే..
Supar Star Rajinikanth
Follow us on

తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుందంటే మాములుగా ఉండదు. ఆయన అభిమానులు సూపర్ స్టార్ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ నెల్సన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇటీవలే దళపతి విజయ్ తో బీస్ట్ సినిమా చేశారు నెల్సన్ దిలీప్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా నిరాశ పరచడంతో ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమా పై అంచనాలు పెరిగాయి. పైగా సూపర్ స్టార్ రజినీ కాంత్ తో కాబట్టి ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఈ సినిమాకు జైలర్ అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. తెలుగు తమిళ్ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమానుంచి ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా జైలర్ మూవీ నుంచి గ్లిఫ్స్ ను రిలీజ్ చేశారు.

‘జైలర్’ టైటిల్ పోస్టర్ ను వదిలిన దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వెళుతున్నాయి.  ఇక ఇప్పుడు ఈ గ్లిమ్ప్స్ ఆ అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఈ సినిమాలో ఆయన పాత్ర అయిన ‘ముత్తు వేల్ పాండియన్’ ను పరిచయం చేశారు.

డీసెంట్ గా రెడీ అయ్యి.. బయటకు వచ్చి కత్తిని తీసుకుంటున్నట్టు ఈ గ్లిమ్ప్స్ లో చూపించారు. ఒక జైలు చుట్టూ తిరిగే కథ అనీ .. ‘జైలర్’ చుట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. నరసింహ సినిమా తర్వాత ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా ఇది. అలాగే బాబా సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు రమ్యకృష్ణ .అలాగే ఈ మూవీ లో ఐశ్వర్య రాయ్ కూడా నటిస్తున్నారని టాక్. ఇక ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి