Jagapathi Babu: సౌందర్యకి లవ్ లెటర్ రాశారా.? అసలు విషయాన్ని చెప్పేసిన జగపతి బాబు..

నటుడు జగపతిబాబు తనపై వచ్చిన ప్రేమలేఖ రూమర్లపై స్పందిస్తూ, సౌందర్యకు తాను ఎప్పుడూ లేఖలు రాయలేదని, అదంతా పచ్చి అబద్ధమని తేల్చి చెప్పారు. సౌందర్య ఒక గొప్ప నటి అని, ఆమె మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన నటన, కెరీర్ విశేషాలను ఈ సందర్భంగా పంచుకున్నారు.

Jagapathi Babu: సౌందర్యకి లవ్ లెటర్ రాశారా.? అసలు విషయాన్ని చెప్పేసిన జగపతి బాబు..
Jagapathi Babu, Soundarya

Updated on: Apr 25, 2026 | 10:00 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో జగపతి బాబు, సౌందర్యల కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ‘మోస్ట్ సక్సెస్‌ఫుల్ పెయిర్’గా పేరు తెచ్చుకున్నారు. అయితే, వీరిద్దరి మధ్య ఏదో ఉందనే రూమర్లు గతంలో షికారు చేసేవి. ముఖ్యంగా జగపతి బాబు సౌందర్యకు ఒక లవ్ లెటర్ రాశారని, అందులో పేజీల కొద్దీ ‘ఐ లవ్ యూ’ అని రాశారనే వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో జగపతి బాబు ఈ రూమర్లపై చాలా ఓపెన్‌గా స్పందించారు.

ఇది చదవండి: ఇది చిటికెడు వేస్తే చాలు.. మందార మొక్కకు వచ్చే తెల్లని పురుగులను తరిమి కొట్టొచ్చు..

సౌందర్యకు ప్రేమలేఖ రాశారా అన్న ప్రశ్నకు జగపతి బాబు నవ్వుతూ సమాధానమిచ్చారు. “అదంతా చెత్త.. ప్యూర్ రబ్బిష్!” అని కొట్టిపారేశారు. అలాంటి పనులు చేయడం చాలా చీప్ అని, అదంతా ఎవరో కల్పించిన అబద్ధం అని స్పష్టం చేశారు. “నేను ముప్పై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను, అలాంటి పనులు చేసే అంత మెచ్యూరిటీ నాలో లేదు” అని ఆయన కుండబద్దలు కొట్టారు. అసలు అలాంటి ఆలోచన రావడమే విడ్డూరంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సౌందర్య గురించి మాట్లాడుతూ జగపతి బాబు ఎంతో ఎమోషనల్ అయ్యారు.

“సౌందర్యను నేను ఇప్పటికీ మిస్ అవుతున్నాను, కేవలం నేను మాత్రమే కాదు, మొత్తం ఇండస్ట్రీ ఆమెను మిస్ అవుతోంది. ఆమె మనసున్న మనిషి, అద్భుతమైన నటి. అన్ని్ంటికంటే మించి ఆమె ఒక గొప్ప వ్యక్తి” అని తన అభిమానాన్ని చాటుకున్నారు. ఆమెతో ఉన్న స్నేహం చాలా పవిత్రమైనదని, దానిని ఇలాంటి రూమర్లతో కలుషితం చేయడం సరికాదని హితవు పలికారు. ఇంటర్వ్యూలో కేవలం ఈ రూమర్ల గురించే కాకుండా, తన నటన శైలి గురించి, డైలాగ్ డెలివరీ గురించి, రాజమౌళి సినిమాల్లో విలన్ పాత్రల గురించి కూడా జగపతి బాబు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

ఇది చదవండి: 33 సిక్సర్లు, 47 ఫోర్లతో ఊహకందని ఊచకోత.! వెంట్రుక పీకలేరంటూ సర్పంచ్ సాబ్ ఊదిపడేశాడుగా

Follow Us