Jabardasth : ఆ ఒక్క కారణం వల్లే రాకెట్ రాఘవ జబర్దస్త్ మానేయట్లేదు.. జబర్దస్త్ కమెడియన్..

జబర్దస్త్ నుండి రాము బయటకొచ్చే సమయంలో రాకెట్ రాఘవ అతడిని ఆపడానికి ప్రయత్నించారని.. రాఘవ జబర్దస్త్‌ను ఎందుకు వదలలేదో అనే విషయాలను జబర్దస్త్ రాకెట్ రాఘవ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమాలలో అవకాశాల కోసం తాను చేస్తున్న ప్రయత్నాలు, ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి అనేక విషయాలు పంచుకున్నారు.

Jabardasth : ఆ ఒక్క కారణం వల్లే రాకెట్ రాఘవ జబర్దస్త్ మానేయట్లేదు.. జబర్దస్త్ కమెడియన్..
Rocket Raghava

Updated on: May 06, 2026 | 3:26 PM

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన నటీనటులు చాలా మంది ఉన్నారు. కొందరు ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉండగా.. మరికొందరు సరైన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటి వారిలో రాము ఒకరు. ఈ షో నుంచి బయటకు వచ్చిన సందర్భం, అలాగే సహ నటుడు రాకెట్ రాఘవ గురించి ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాము జబర్దస్త్ నుంచి బయటకు వస్తున్నప్పుడు, అప్పటి తన టీమ్ లీడర్ రాకెట్ రాఘవ తనను ఆపడానికి ప్రయత్నించారని తెలిపారు. సొంత తమ్ముడికి నచ్చజెప్పినట్లుగా “నా మాట విని కొన్ని రోజులు ఉండు, సినిమాలు ఇక్కడి నుంచే ప్రయత్నించు” అని రాఘవ బతిమిలాడారని రాము గుర్తు చేసుకున్నాడు. అయితే, తన వ్యక్తిత్వం రాఘవకు పూర్తిగా తెలుసని, ఆయన తన నిర్ణయాన్ని అర్థం చేసుకున్నారని రాము పేర్కొన్నారు. రాఘవ సలహాల పట్ల తనకు గౌరవం ఉందని, ఇప్పటికీ ఇద్దరి మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో చాలా స్పెషల్.. కలిసి నటించడం చాలా ఇష్టం.. నయనతార..

రాము జబర్దస్త్ నుండి బయటకు రావడానికి గల కారణాలను వివరిస్తూ, సినీ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించడమే తన లక్ష్యమని చెప్పారు. “వచ్చింది అనుకో మన జనరేషన్ తలుచుకుంటుంది. పోయింది అనుకో పర్వాలేదురా వాడు ట్రై చేశాడు కాలేదు అని మళ్ళీ ఇంకొకళ్ళు ట్రై చేయడానికి నేను ఏమైనా చెప్పగలుగుతా” అనే ఆలోచనతో బయటకు వచ్చానని వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : 12 ఏళ్లుగా నా బ్రేక్ ఫాస్ట్ ఇదే.. అందుకే ఇలా ఉన్నాను.. డైట్ సీక్రెట్ చెప్పిన రవి బాబు..

జబర్దస్త్‌లోకి చాలా మంది టీం లీడర్లు వస్తున్నారని, ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాత బయటకు వెళ్తున్నారని, కానీ రాకెట్ రాఘవ మాత్రమే 750కి పైగా ఎపిసోడ్‌ల పాటు కొనసాగడం వెనుక గల కారణాన్ని రాము వెల్లడించారు. రాఘవ విద్యావంతుడని, ఆయన తండ్రి ఉపాధ్యాయుడని, టీవీ రంగంలో అప్పటికే చాలా కార్యక్రమాలు చేశారని పేర్కొన్నారు. అయితే ఆ కార్యక్రమాలేవీ ఆయనకు శాశ్వత మద్దతు ఇవ్వలేకపోయాయని తెలిపారు. కుటుంబాన్ని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, బయట అవకాశాల పట్ల అనిశ్చితిని గుర్తించి, రాఘవ జబర్దస్త్‌ను వదలలేదని రాము అన్నారు. రాఘవ స్కిట్లలో అశ్లీలత, డబుల్ మీనింగ్స్, బాడీ షేమింగ్ ఉండవని, ఆయన చేసే కామెడీ ఎప్పుడూ నాణ్యతతో కూడుకున్నదని రాము తెలిపారు. ఆయనకు ఒక ప్రత్యేకమైన అభిమానగణం ఉందని, తన పరిధిలో ఉంటూనే సినిమాలలో కూడా నటిస్తున్నారని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా చేయడమే సావిత్రి తప్పు.. అక్కడే పతనం మొదలైంది.. సీనియర్ నటి జమున..

Follow Us