Jabardasth Pavithraa: ప్రేమ వివాహం చేసుకోనున్న జబర్దస్త్ పవిత్ర.. గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

|

Nov 09, 2023 | 5:06 PM

మొదట టిక్‌ టాక్‌ వీడియోలు, యూట్యూబ్‌లో షార్ట్‌ఫిల్మ్స్‌ చేసుకునే పవిత్ర జబర్దస్త్‌లోకి వచ్చాక బాగా పాపులరైంది. బుల్లెట్‌ భాస్కర్, హైపర్ ఆది, మంకీ వెంకీ, రాఘవ టీమ్స్‌లో కంటెస్టెంంట్‌గా నవ్వుల పువ్వులు పూయిస్తోంది. అడపాదడపా కొన్ని సినిమాల్లోనూ కనిపిస్తోంది

Jabardasth Pavithraa: ప్రేమ వివాహం చేసుకోనున్న జబర్దస్త్ పవిత్ర.. గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?
Jabardasth Pavithraa
Follow us on

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్లలో పవిత్ర కూడా ఒకరు. చూడ్డానికి బొద్దుగా కనిపించే ఈ అమ్మాయి పంచులతో బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. మొదట టిక్‌ టాక్‌ వీడియోలు, యూట్యూబ్‌లో షార్ట్‌ఫిల్మ్స్‌ చేసుకునే పవిత్ర జబర్దస్త్‌లోకి వచ్చాక బాగా పాపులరైంది. బుల్లెట్‌ భాస్కర్, హైపర్ ఆది, మంకీ వెంకీ, రాఘవ టీమ్స్‌లో కంటెస్టెంంట్‌గా నవ్వుల పువ్వులు పూయిస్తోంది. అడపాదడపా కొన్ని సినిమాల్లోనూ కనిపిస్తోంది. బుల్లితెరపై పంచులతో అదరగొట్టే ఈ లేడీ కమెడియన్‌ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది. తన ప్రియుడు సంతోష్‌తో కలిసి పెళ్లిపీటలెక్కనుంది. తాజాగా ఈ ప్రేమ పక్షుల నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది. ఈ శుభవార్తను పవిత్రనే సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. తన ప్రియుడు సంతోష్‌తో ఉంగరాలు మార్చుకున్న ఫొటోలతో పాటు ఒక ఎమోషనల్‌ పోస్టును పంచుకుంది.

 

ఇవి కూడా చదవండి

‘నా జీవితంలో ఈ రోజు ఎంతో స్పెషల్‌. నా ప్రేమ కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న సంతోష్‌కు ఓకే చెప్పాను. అతడిని వివాహం చేసుకునేందుకు అంగీకరించాను. అనుకోకుండా జరిగే కొన్ని పరిచయాలు మన జీవితంలో ఎంతో స్పెషల్‌గా నిలిచిపోతాయి. మనసులోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. సంతోష్‌. నాపై లెక్కలేనంత ప్రేమ చూపించాడు. నా ప్రేమ కోసం ఒక సంవత్సరం పాటు వేచి చూశాడు. ఇప్పుడా నిరీక్షణకు తెరపడింది . నా ఆఖరి శ్వాస వరకు నీ చేయి వదలను. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇద్దరం కలిసి చిరునవ్వుతో వాటిని అధిగమిద్దాం. నా లైఫ్‌లో అడుగుపెట్టినందుకు సంతోష్‌కు ధన్యవాదాలు. నువ్వు నన్ను ఎప్పుడూ నవ్విస్తూ ఉంటావు, నన్నొక మహారాణిలా చూసుకున్నావు. కష్ట కాలంలోనాకు అండగా నిలబడ్డావు. ఇక మీదట మనం కలిసి ప్రయాణం చేద్దాం. అలాగే మా ప్రేమను అంగీకరించిన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది పవిత్ర.

నా ఆఖరి శ్వాస వరకు నీ చేయి వదలను..

సంతోష్‌ ఎవరంటే?

పవిత్రకు కాబోయే భర్త సంతోష్‌ విషయానికొస్తే.. గతంలో ఒక సందర్భంలో స్టేజిమీదే అందరి ముందు పవిత్రకు లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. అయితే అప్పుడు ఎలాంటి సమాధానం చెప్పలేదు పవిత్ర. ఆ తర్వాత ప్రేమికుల రోజు సందర్భంగా ఇద్దరూ కలిసి ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఆ సమయంలో కూడా లవ్‌ ప్రపోజల్‌ వచ్చింది. ఇద్దరూ తెగ సిగ్గుపడిపోయారు. ఇప్పుడు ఆ సంతోష్‌తోనే ఏడడుగులు వేసేందుకు సిద్ధమైందీ లేడీ కమెడియన్‌. దీంతో పలువురు ప్రముఖులు, అభిమానులు పవిత్ర- సంతోష్‌లకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

పవిత్ర లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..