జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో కెవ్వు కార్తీక్ ఒకరు. నటన మీద ఆసక్తితో మంచి ఉద్యోగం వదులుకునీ మరీ ఇండస్ట్రీలోకి వచ్చాడీ తెలంగాణ కుర్రాడు. మొదట్లో మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించాడు. ఆతర్వాత జబర్దస్త్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంటర్ అయ్యాడు. తన కామెడీ ట్యాలెంట్‌తో టీమ్ లీడర్ స్థాయికి అంచెలంచెలుగా ఎదిగాడు. ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షోలో నవ్వుల పువ్వులు పూయిస్తోన్న కార్తీక్ ఓ శుభవార్త చెప్పాడు. త్వరలో అతను ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఈ విషయాన్నిఅతనే సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించాడు. ఈ సందర్భంగా తనకు కాబోయే భార్యతో దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. అయితే ఈ రెండు ఫొటోల్లోనూ కూడా ఆమె ఎవరన్నదీ మాత్రం రివీల్ చేయలేదీ జబర్దస్త్ కమెడియన్. ‘మీ జీవితంలోకి ఒక కొత్త పర్సన్ వస్తే.. లైఫ్ మరింత సంతోషంగా ఉంటుందని కొందరు అంటుంటారు. బహుశా అది ఇదే కావచ్చు. నా జీవితంలోకి వచ్చినందుకు థాంక్యూ బ్యూటీఫుల్. నీతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ తనకు కాబోయే భార్యపై ప్రేమను కురిపించాడు కార్తీక్.
ప్రస్తుతం కెవ్వు కార్తీక్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదిరే అభి, జోర్దార్ సుజాత, గెటప్ శ్రీను వంటి టీవీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు, నెటిజన్లు కాబోయే జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే అమ్మాయిని ఎప్పుడూ చూపిస్తావంటూ సరదాగా కామెంట్లు పెట్టారు. కాగా బుల్లితెరతో పాటు ఈ మధ్యన వెండితెరపై కూడా మెరుస్తున్నాడు కెవ్వు కార్తీక్. అతను తాజాగా నటించిన చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన ఈ సినిమా శుక్రవారం (జూన్2) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..