Jabardasth Fame Getup Srinu Play Role In Acharya Movie: జబర్ధస్త్ కామెడీ ప్రోగ్రామ్ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన కామెడియన్లలో గెటప్ శ్రీను ఒకరు. తనదైన పంచ్‌లతో, కామెడీ టైమింగ్‌తో బుల్లి తెర ప్రేక్షకులను కడుబుబ్బ నవ్వించే శ్రీను.. వెండితెరపై కూడా తనదైన శైలిలో నవ్వులు పూయిస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన శ్రీను వెండి తెర ప్రేక్షకులకు కూడా తన నవ్వులు పంచుతున్నాడు. ఇటీవల గెటప్ శ్రీను తన స్వగ్రామమైన ఆకివీడులోని కళింగగూడెం వెళ్లాడు. ఆ సంర్భంగా స్థానికంగా ఉన్న వీలేకర్లతో మాటమంతీ జరిపిన శ్రీను తన ఫ్యూచర్ ప్లానింగ్స్, ఏయో చిత్రాల్లో నటిస్తున్నాడు లాంటి వివరాలను పంచుకున్నాడు. ప్రస్తుతం శ్రీను.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోన్న ‘లైగర్’ చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రంలోనూ నటించే లక్కీ చాన్స్ కొట్టేసిన్నట్లు పేర్కొన్నాడు. ఈ సినిమాలో శ్రీనుకు మంచి పాత్రను పోషించనున్నాడట. ఇక గెటప్ శ్రీను ‘రాజూ యాదవ్’ చిత్రంలో హీరోగా నటిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.